వెన్న పండు గురించి తెలుసా..?

­ఏంటి ఈ ‘వెన్నపండు’ అని ఆశ్చర్యపోతున్నారా..? ఆవకాడోను మొదట వెన్నపండు అనే పిలిచేవారట. ఆవకాడో అమెరికాకు చెందిన ఫ్రూట్‌. ఆవకాడో వల్ల ఎన్నో సమస్యలకు చెక్‌ పెట్టొచ్చని మనకు తెలుసు. అలాగే ఆవకాడోను బ్యూటీ ప్రాడెక్ట్స్‌లో ఉపయోగిస్తూ ఉంటారు. సబ్బులు, క్రీముల రూపంలో మార్కెట్‌లో మనకు దొరుకుతూనే ఉంటాయి. ఆవకాడో స్కిన్‌ని తాజాగా అందంగా ఉంచుతుంది. అలాగే.. కొంతమంది ఆవకాడోను సలాడ్స్‌, మరికొన్ని వంటలలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే.. ఆవకాడో వల్ల ఇవే కాదు.. జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుందని తాజా అధ్యాయనాలలో తేలిందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

అంతేకాకుండా.. ఆవకాడో ప్రతిరోజు ఫుడ్‌లో తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందంట. ఆరునెలల పాటు క్రమం తప్పకుండా ప్రతిరోజు అవకాడోను తింటే వృద్ధుల కళ్లలో ల్యుటిన్ ప్రమాణాలు పెరుగుతాయి. దాంతో మెదడు చురుగ్గా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ ల్యుటిన్ పండ్లు, కూరగాయలలో ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల పెరిగిన ల్యుటిన్ మెదడు, కళ్లలోకి చేరుతుంది. ల్యుటిన్ యాంటీ ఇన్‌ప్లమేటరీ ఏజెంటు మాత్రమే కాకుండా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా సహాయపడుతుంది. జ్ఞాపకశక్తితో పాటు ఏకాగ్రతా శక్తి పెరగడాన్ని కూడా గుర్తించవచ్చు. అవకాడో తినని వారిలో కాగ్నిటివ్ సామర్థ్యం తక్కువగా పెరగడాన్ని పరిశోధకులు గమనించారు. అవకాడో మెదడు ఆరోగ్యాన్నే కాకుండా కంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. సప్లిమెంట్స్ తినే వారితో పోలిస్తే తాజా అవకాడో తిన్న వాళ్ల కళ్లలో ల్యుటిన్ ప్రమాణాలు రెట్టింపుగా ఉంటాయి. వృద్ధుల కంటిని, మెదడుని ఆరోగ్యంగా ఉంచేందుకు దివ్యౌషధంగా సహాయ పడుతుంది. ఇంకెందుకు, ఆలస్యం బాగా తిని ఆరోగ్యంగా ఉండండి.

ఇక మన వెన్న పండులో పోషక విలువలు చూస్తే.. 100 గ్రాముల ఆవకాడో గుజ్జులో 160 కిలో కేలరీల శక్తి ఉంటుంది, 485 మిల్లీ గ్రాముల పొటాషియం లభిస్తుంది. బి, ఇ, కె విటమిన్లు కూడా లభిస్తాయి. పీచు పదార్థం 75 శాతం, 25 శాతం సాల్యుబుల్ ఫైబర్ ఉంటాయట.

leave a reply