పడి పడి లేచే మనసు.. ఏరియా వైజ్ కలెక్షన్స్

Sharwanand Padi Padi Leche Manasu Movie First Look ULTRA HD Posters WallPapers

హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్.. సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘పడి పడి లేచే మనసు’.  క్రిస్మస్ సీజన్ సందర్భంగా డిసెంబర్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  విడుదలైన రోజునుండే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయింది.. క్లోజింగ్ కలెక్షన్స్ బయటకు వచ్చాయి. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్  ప్రపంచవ్యాప్తంగా రూ. 22.5 కోట్లకు అమ్ముడయ్యాయి.  కానీ ఫైనల్ రన్ లో సినిమా 35% ఇన్వెస్ట్మెంట్ మాత్రమే రికవరీ చేయగలిగింది.  ఇండియాలోనే కాకుండా అమెరికాలో కూడా ఈ సినిమా నష్టాలే మిగిల్చింది.  బ్రేక్ ఈవెన్ కోసం $900k  గ్రాస్ కలెక్షన్స్ సాధించాల్సి ఉండగా  $315k గ్రాస్ తో మాత్రమే సరిపెట్టుకుంది.  ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 7.97 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది.  దర్శకుడు హను రాఘవపూడి.. శర్వానంద్ లకు వారి కెరీర్లలో ఈ సినిమా మరో డిజాస్టర్.

ప్రపంచ వ్యాప్తంగా ‘పడి పడి లేచే మనసు’ ఏరియా వైజ్ కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

నైజామ్: 2.61 cr

సీడెడ్: 0.84 cr

ఉత్తరాంధ్ర: 0.82  cr

ఈస్ట్ : 0.42 cr

వెస్ట్: 0.32 cr

కృష్ణ: 0.49 cr

గుంటూరు: 0.62 cr

నెల్లూరు: 0.31 cr

ఏపీ + తెలంగాణా: రూ. 6.43 cr   

రెస్ట్ అఫ్ ఇండియా: 0.48  cr

ఓవర్సీస్: 1.06  cr 

వరల్డ్ వైడ్ టోటల్: రూ. 7.97 cr (డిస్ట్రిబ్యూటర్ షేర్)

leave a reply