ధోనీ, రోహిత్‌ శర్మ రాక..బుమ్రాకు విశ్రాంతి

ఆస్ట్రిలియా వేదికగా జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా తన అద్భుతమైన ప్రదర్శనతో సరికొత్త చరిత్ర నెలకొల్పింది. ఈ నెల 12 న ప్రారంభమయ్యే వన్డే  సిరీస్ కు భారత క్రికెటర్లు ధోనీ, రోహిత్‌ శర్మ, కేదార్‌ జాదవ్‌, ఖలీల్‌ అహ్మద్‌ సోమవారం ఆస్ట్రేలియాకు పయనమయ్యారు. మూడు వన్డే సిరీస్‌లో టీమిండియాలో వీరు సభ్యులుగా ఉంటారు. ఇక రోహిత్ శర్మ కూతురు పుట్టిన సందర్భంగా ఆసీస్‌తో ఆఖరిదైన నాలుగో టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. వీరి రాకతో టీమిండియాకు మరింత బలం చేకూరనుంది.  

కాగా, టెస్టు సిరీస్‌లో సత్తా చాటిన బుమ్రాకు విశ్రాంతి దొరకనుంది. బుమ్రాకు తదుపరి మ్యాచ్‌ల్లో బీసీసీఐ విశ్రాంతి కల్పించింది. ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే మ్యాచ్‌లు, తరవాత జరగబోయే న్యూజిలాండ్‌ పర్యటనలో బుమ్రా ఆడట్లేదని ప్రకటించింది. అతడి స్థానంలో హైదరాబాద్‌ కుర్రాడు మహ్మద్‌ సిరాజ్‌కు అవకాశం కల్పించింది. త్వరలో ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడమే మంచిదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్‌లు, న్యూజిలాండ్‌ పర్యటనలో బుమ్రా స్థానంలో మహ్మద్‌ సిరాజ్‌ ఆడుతాడు’ అని బీసీసీఐ వివరించింది.

leave a reply