పైనాపిల్‌తో.. ఎన్ని లాభాలో..!

పైనాపిల్‌ దీనిని తెలుగులో అనాప పండు అని కూడా అంటారు. చూడటానికి పండు చుట్టూ ముళ్లులు ఉన్నట్లు కనిపిస్తుంది. తియ్య తియ్య‌గా, పుల్ల పుల్ల‌గా ఉండే పైనాపిల్ పండ్ల‌ను చాలా మంది ఇష్టంగానే తింటుంటారు. కొంద‌రు వీటిని నేరుగా పండ్ల రూపంలో తీసుకుంటే కొంద‌రు మాత్రం జ్యూస్ లా చేసుకుని తాగుతారు. అయితే ఎలా తీసుకున్నా మనకు కావాల్సిన ప్రయోజనాల్లో ఏ లోపం ఉండదు.

పైనాపిల్లో ప్రొటీన్స్‌ పుష్కలంగా ఉంటాయి. నీరు శాతం ఎక్కువగా ఉంటుంది. కాల్షియం, పాస్పరస్, ఐరన్‌, కెరోటిన్‌ ఇవన్నీ పైనాపిల్లో లభిస్తాయి. చాలా వంటకాల్లో, కేకుల్లో ఈ పైనాపిల్‌ను ఉపయోగిస్తూ ఉంటారు. దీని వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందామా..!

1.రక్త నాళాల్లో రక్తం గడ్డకట్ట కుండా కాపాడుతుంది.

2.ఆడవారికైతే నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది.

3.పండిన అనాస పండును తింటుంటే పళ్ళ నుండి రక్తంకారే స్కర్వే వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుంది.

4.పూర్తిగా పండని అనాస రసం తీసు కుంటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.

5.జ్వరం, కామెర్ల వంటి అనారోగ్యాలలో ఉన్న వారికి అనాస రసం ఇవ్వడం ఎంతో మంచిది. అనాస పండును ఆహారంగా తీసుకోవడం అందరికీ తెలిసిందే! కానీ అందచందాలను ఇనుమడింపజేసే శక్తి కూడా ఎక్కువగా ఉంది.

6.అనాసపండు రసాన్ని ముఖాని కి రాసుకుని మర్థన చేస్తే ముఖ చర్మం కోమలంగా, అందంగా మారుతుంది. పండులోని ఎంజైములు ముఖ చర్మంలో నశించిన కణాలను తొలగిస్తాయి. అంతే కాకుండా నల్లటి మచ్చలను తొలగిస్తుంది.

7.అనాసలోని ఎంజైమ్స్‌ వాపులను, నాసికా సంబంధమైన వ్యాధుల ను, టైఫాయిడ్‌ని ఉప శమనం చేస్తుంది.

8.ఇది అర గడానికి రెండు గంటలు పడుతుంది. పండని అనాసకాయ తింటే అరగడం చాలా కష్టమవుతుంది. దీనితో విరేచనాలు అవుతాయి.

9.బాగా పండిన అనాస రసం శరీర తాపాన్ని తగ్గిస్తుంది. అదనపు శక్తిని కూడా కలిగిస్తుంది. ఈ పండులో ఉన్న కొన్ని ఎంజైమ్స్‌ కారణంగా జీర్ణశక్తి పెరిగి జీర్ణాశయానికి చక్కగా పని చేస్తుంది.

10.ఈ పండులో అధికమైన పీచుపదార్థం మలబద్దకానికి మంచి మందుగా పని చేస్తుంది.

leave a reply