చర్మం కోమలంగా అవ్వాలంటే..

Fruit, drink, grape.

చర్మం మిలమిలగా మెరిసిపోవాలని ఎవరికైనా ఉంటుంది. నిత్యం యౌవ్వనంగా, ఎనర్జీగా ఉండాలని అందరికీ అనిపిస్తుంది. ఇలా మెరిసిపోవాటంలే రోజూ తాజా కూరగాయలు లేదా పండ్లతో తయారు చేసిన జ్యూస్‌లను తాగితే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. రోజూ క్రమం తప్పకుండా జ్యూస్‌లు తీసుకుంటే.. అవన్నీ ఇవి మన శరీరానికి సంపూర్ణ పోషణను అందిస్తాయి. శరీరానికి శక్తినిస్తాయి. ఈ క్రమంలోనే నిత్యం అనేక మంది అనేక రకాల కూరగాయలు లేదా పండ్ల రసాలను తాగుతుంటారు. అయితే ఈ కాలంలో తలెత్తే చర్మ సమస్యలకు మాత్రం కింద చెప్పిన జ్యూస్‌లను తాగాల్సిందే. ఎందుకంటే ఈ జ్యూస్‌లను తాగితే చర్మ ఆరోగ్యానికి సంబంధించిన విటమిన్లు, మినరల్స్ మనకు అందుతాయి. ఫలితంగా చర్మం కాంతివంతంగా, కోమలంగా మారుతుంది. మరి అవేంటో చూసేద్దామా..!

1. క్యారెట్ : క్యారెట్లలో ఉండే విటమిన్ ఎ పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని శుభ్రం చేస్తుంది. చర్మానికి సహజసిద్ధమైన కాంతిని తెస్తుంది. చర్మంపై ఏర్పడే మొటిమలు, మచ్చలను పోగొడుతుంది. చర్మం పొడిబారకుండా, దద్దుర్లు ఏర్పడకుండా చూస్తుంది.

2. బీట్‌రూట్ : బీట్‌రూట్‌లో విటమిన్ ఎ, సి, కె, కాపర్, మెగ్నిషియంలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై ఏర్పడే మచ్చలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. చర్మం ఫెయిర్‌గా మారుతుంది.

3. టమాటా : టమాటాల్లో లైకోపీన్ అనబడే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఎండవల్ల కందిపోయిన చర్మాన్ని బాగు చేస్తుంది. చర్మం సౌందర్యాన్ని మెరుగు పరుస్తుంది. వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వదు. దీంతో చర్మం ఎప్పుడూ కాంతివంతంగా, మృదువుగా ఉంటుంది. యవ్వనంగా కనిపిస్తారు. టమాటాల్లో ఉండే విటమిన్ సి, పొటాషియం చర్మ సౌందర్యాన్ని పరిరక్షిస్తాయి.

4. యాపిల్ : రోజూ ఒక యాపిల్‌ను తింటే డాక్టర్‌కు దూరంగా ఉండవచ్చనే విషయం తెలిసిందే. అలాగే రోజూ యాపిల్ జ్యూస్‌ను తాగితే పొడి చర్మం తేమగా మారుతుంది. మృదువుగా తయారవుతుంది. యాపిల్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయవు. కణాలను నాశనం కాకుండా రక్షిస్తాయి. దీంతో చర్మ సౌందర్యం పెరిగి యవ్వనంగా కనిపిస్తారు.

5. లెమన్ : నిమ్మలో ఉండే విటమిన్ సి చర్మాన్ని శుభ్రం చేస్తుంది. ఇది పీహెచ్ లెవల్స్‌ను నియంత్రిస్తుంది. దీంతో యంగ్‌గా కనిపిస్తారు. చర్మం ఫెయిర్‌గా మారుతుంది.

పైన చెప్పిన వాటిని రోజూ తాగుతూ ఉంటే నిత్యం యంగ్‌గా, ఫెయిర్‌గా కనిపించడం ఖాయం. సో ఒకసారి మీరే ట్రై చేయండి. వావ్‌ అనడం ఖాయం.

leave a reply