మచ్చలకు… బంగాళదుంప!

కొన్ని సార్లు వేడిమి వల్ల చర్మం రంగు మారటమే కాకుండా మొహంపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఈ సమస్య మెడ, కాళ్లు, చేతుల మీదా కూడా తలెత్తవచ్చు. శరీరం మెలనిన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేయటమే దీనికి కారణంగా చెప్తారు. ఆరోగ్య సమస్యలు, హార్మోన్లలో మార్పు రావడం, కొన్ని కారణాలుగా చెప్పవచ్చు.. ఎండ ప్రభావం, చర్మం గాయాలపాలవటం, మానసిక ఒత్తిడి, కొన్ని రకాల రసాయనాలు వంటి బాహ్య కారణాలు శరీరంఫై వచ్చేమచ్చలకు కారణంగా చెప్పవచ్చు.

అయితే దీనిని నివారించడానికి  బంగాళ దుంపను వాడితే ఈ సమస్యను అధికమించవచ్చు. ఇందులో ఉండే కాటెకోలాజ్‌ అనే ఎంజైమ్‌ అధిక మెలనిన్‌ ఉత్పత్తిని నిరోధిస్తుంది. చర్మంపైన మచ్చలు లేకుండా చేసి మంచి ఛాయను ఇస్తుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

శుభ్రపరిచిన పచ్చి బంగాళ దుంపను రెండు ముక్కలుగా కోయాలి. దుంప లోపలి భాగంలో కొంచెం నీళ్లు చల్లి, చర్మంపైన మచ్చలు ఉన్న చోట ముక్కలను రెండు నిమిషాల పాటు రుద్దాలి. తరువాత పది నిమిషాలు ఆగి గోరు వెచ్చని నీటితో కడగాలి. ఇలా ప్రతి రోజు నాలుగు సార్లు, నెల రోజుల పాటు చేస్తే హైపర్‌ పిగ్మంటేషన్‌ బారి నుంచి తప్పించుకోవచ్చు.

leave a reply