స్నాక్స్‌గా బాదం పప్పు… ఎంతో మేలు!

బాదం పప్పులో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయని అంటున్నారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా బాదం పప్పును తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా దొరుకుతాయి. నీరసం ఎక్కువగా ఉన్నవారు స్నాక్స్‌గా వీటిని తీసుకోవడం బెస్ట్ ఛాయిస్ అని న్యూట్రిషియనిస్టులు చెబుతున్నారు. వీటిలో విటమిన్-ఇ, కాల్షియం, శరీరానికి మేలు చేసే కొవ్వులు, పీచు పదార్థాలు, రైబోప్లోవిన్, మాంగనీస్, కాపర్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల వీటిని తీసుకోమని చెప్తారు.

దాదాపుగా రోజుకి 20 గింజల వరకు స్నాక్స్ గా తీసుకుంటే, అధిక శాతంలో కెలోరీల శక్తి శరీరానికి అందుతుంది. 2.5 గ్రాముల కార్బోహైడ్రేట్స్ శరీరానికి అందవచ్చు. వీటిలో మోనోశాచ్యురేటెడ్ ఫ్యాట్స్, ఫైబర్, ప్రొటీన్లు, ముఖ్య పోషకాలు ఉంటాయి. బాదం గింజలు కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. కణాలు దెబ్బతినడం ద్వారా త్వరగా వృద్ధాప్యం దరి చేరడంతోపాటు జబ్బుల బారిన పడతారు. స్మోకింగ్ అలవాటు ఉన్నవారు బాదం పప్పు తింటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుండి బయటపడవచ్చు.

leave a reply