కార్తీక్.. మెరుపు క్యాచ్!

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా క్రికెటర్‌ దినేష్‌ కార్తీక్‌ అద్భుతమైన ఫీల్డింగ్ తో సాధ్యంకాని క్యాచ్‌ పట్టి ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఈ క్యాచ్‌కు ముందు టిమ్‌ సీఫెర్ట్‌ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేసిన ఈ సారి మాత్రం డెరిల్‌ మిచెల్ అవుట్‌ చేయడంలో విఫలమవలేదు. క్యాచ్ అందుకోవడమే కాకుండా సిక్స్‌ను అడ్డుకున్నాడు. బౌండరీ లైన్‌ వద్ద కార్తీక్‌ చేసిన ఈ ఫీట్‌కు మైదానంలోని అభిమానులు అవాక్కయ్యారు.

హార్దిక్‌ పాండ్యా వేసిన 16వ ఓవర్‌ చివరి బంతిని కివీస్‌ ఆటగాడు డెరిల్‌ మిచెల్ అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించగా… ఆ దిశలో బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న దినేష్‌ కార్తీక్‌ అద్భుతంగా అందుకున్నాడు. అయితే బౌండరీ లైన్ తాకబోయిన కార్తీక్ .. బంతిని గాల్లోకి విసిరేసి మళ్లీ వచ్చి అందుకున్నాడు. కానీ ఈ క్యాచ్‌పై కార్తీక్ కూడా అనుమానం వ్యక్తం చేయగా, థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం ప్రకటించే వరకు దినేష్‌ కార్తీక్‌ స్పష్టం చేయలేకపోయాడు. బంతి అందుకునే సమయంలో.. విడిచే సమయంలో మళ్లీ అందుకునే సమయంలో అతను బౌండరీ లైన్‌ను తాకలేదని సమీక్షలో స్పష్టం కావడంతో థర్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు. దీంతో డెరిల్‌ విచెల్‌ పెవిలియన్ చేరాడు.

leave a reply