మా ఆయన ఎం…తింటాడంటే!

మెగా పవర్ స్టార్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన డైట్ మరియు ఫిట్ నెస్ విషయంలో చరణ్ పాటించే కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు. హీరో రామ్ చరణ్ ఫిట్ నెస్ విషయంలో కఠినంగా ఉంటాడనే విషయం అందరికీ తెలిసిందే. వర్క్ అవుట్స్ చేయడంతో పాటు, డైట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తాడు. ఏ మధ్య చరణ్ ఉపాసన కలిసి  వర్క్ అవుట్స్ చేసే కొన్ని చిత్రాలను కూడా చేసారు. అయితే అయన సతీమణి చరణ్  తీసుకునే డైట్ వివరాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.అంతేకాకుండా,  ఈ డైట్ ను అందరూ ఫాలో అవ్వాలని సూచిస్తూ…అందరూ ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండాలని కోరారు.

ప్రతి రోజు క్రమం తప్పకుండ 12 గంటల పాటు ఉపవాసం ఉండాలి.ఉపవాస సమయంలో ఆహార మరియు ఇతర ద్రవ పానీయాలను తీసుకోకూడదని సూచించారు. మిగిలిన 12 గంటల సమయంలో మెనులో సూచించిన ప్రకారం  ఆహార నియమాలను పాటించాలన్నారు.  ఉపవాస 12 గంటల సమయంలో నీటిని మాత్రమే తీసుకోవాలి. ఏ ఇతర పానీయాలు తీసుకోరాదు. అయితే  ఈ 12 గంటల సమయంలో వీలైనంత ఎక్కువ నీటిని తీసుకోవడం వలన మన శరీరంలోని విష పదార్థాలు బయటికి  వెళతాయి కాబట్టి ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిదన్నారు. ఆల్కనైజ్డ్ వాటర్ అయితే మరీ మంచిదని సూచించారు. అయితే ఎక్కువ శాతం నీటిని తీసుకోవడం వల్ల   పలుమార్లు బాత్ రూమ్ కు వెళ్లడం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ మన శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్తున్నాయనే విషయాన్ని గమనించాలని సూచించారు.

డైట్ వివరాలు:

తీసుకోకూడనివి  : కాఫీ, డైరీ ప్రాడక్ట్స్, రెడ్ మీట్, గోధుమలు, తీపి పళ్లు, ఆల్కహాల్.

తీసుకోవాల్సిన ముఖ్యమైన ప్రొటీన్ ఫుడ్:  లెంటిల్స్, తోఫు, చేప,బేక్డ్, బాయిల్డ్ చికెన్.

కార్బొహైడ్రేట్ ఫుడ్ ఛాయిస్: క్వినోవా, బ్రౌన్ రైస్, ఓట్ మీల్, స్వీట్ పొటాటోస్.

వెజిటబుల్ ఫుడ్ ఛాయిస్: ఉడికించిన  లేదా దోరగా వేయించిన బీన్స్, ఆస్పరాగస్, బ్రాకోలీ. అన్నింటిలోకి వెల్లుల్లిని చేర్చుకోవడం మంచిది.

leave a reply