`కడక్‌నాథ్‌’ ఫిట్‌నెస్‌

క్రికెట్‌లో విజయాలను కైవసం చేసుకోవడంలో టీమిండియాకు ఒక ప్రత్యేకమైన స్థానం, గుర్తింపు ఉంది.  అలాగే అన్ని విజయాలు సాధించాలంటే ముఖ్యంగా క్రికెట్‌ ప్లేయర్స్‌కి ఫిట్‌నెస్‌ అనేది చాలా అవసరం. ఆ విషయంలో కెప్టెన్‌ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే భారత జట్టు సభ్యుల మెరుగైన డైట్‌ కోసం మధ్యప్రదేశ్‌లోని జబువాలోని కృషి విజ్ఞాన కేంద్రం కొన్ని సూచనలు చేసింది. వాటిని వివరిస్తూ విరాట్ కోహ్లీ, బీసీసీఐకు ఓ లేఖ రాసింది.

మీడియా కథనాల ప్రకారం ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు ఆహారంలో గ్రిల్డ్‌ చికెన్‌ తీసుకుంటున్నారని తెలుకున్న కృషి విజ్ఞాన కేంద్రం దానిపై పరిశోధించింది. అయితే.. దానిలో ఎక్కువ మొత్తంలో కొలెస్ట్రాల్ ఉంటుంది. దాన్ని డైట్‌లో తీసుకోవడం కంటే తక్కువ మొత్తంలో కొలెస్ట్రాల్ ఉన్న కఢక్‌నాథ్ చికెన్‌ను వాడటం వల్ల ఎక్కువ ప్రయోజనాలుంటాయని తెలిపింది. హైదరాబాద్‌లోని నేషనల్ రిసెర్చ్‌ సెంటర్‌ ఆన్‌ మీట్ నివేదిక ప్రకారం దానిలో ప్రొటీన్లు, ఐరన్‌ పుష్కలంగా ఉన్నాయి’ అని వివరించింది

కఢక్‌ నాథ్‌ చికెన్‌ మధ్యప్రదేశ్‌లోని జబువా, ధార్‌ జిల్లాల్లో బాగా ప్రసిద్ధి చెందిన వంటకం. కడక్‌నాథ్‌ కోడి మాంసం నలుపు రంగులో ఉంటుంది. అధిక సంఖ్యలో ప్రొటీన్లు, కొవ్వు స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల ఈ చికెన్‌కు చాలా డిమాండ్ ఉంది. అలాగే.. మార్కెట్‌లో దీన్ని మాంసం కిలో రూ.1200 నుంచి 1500 వరకూ దొరుకుతుంది. అలాగే దీని గుడ్డు కూడా రూ.50 వరకూ మార్కెట్లో అమ్ముడుపోతుంది.

leave a reply