చెర్రీ కోసం ఏమైనా.. చేస్తా

తన భర్త, హీరో రామ్‌చరణ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఉపాసన సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం తెలిసిందే. తాజాగా, ‘వినయ విధేయ రామ’ సినిమా లొకేషన్లో చరణ్ కోసం ఆమె చేప ఫ్రై తయారు చేశారు. ఉప్పును వాడకుండా.. ఆలివ్ ఆయిల్, నిమ్మరసంతో ఆమె ఈ డిష్‌ను చేశారు. ఈ వంటకం తయారీలో ఉపాసనకు చరణ్ కూడా సాయం అందించాడు. ఆ తర్వాత ఫిష్‌కు తోడుగా బంగాళాదుంప, వెల్లుల్లిలను ఆమె జత చేశారు. మరో విషయం ఏమిటంటే పక్కనున్న కాలువ నుంచి చరణ్ అసిస్టెంట్ ఈ చేపను పట్టుకొచ్చాడు.

కాగా.. చరణ్‌కు ఏం ఇష్టమో, ఏం అలవాటో.. అవన్నీ చేస్తూ.. ఒక ఇల్లాలుగా తన బాధ్యత నెరవేరుస్తుంది ఉపాసన.

leave a reply