స్ర్కీన్‌షేర్‌…కోసం!

మనం ఇప్పటివరకు స్కైప్‌ లేదా గూగుల్‌ డ్యుయోలో వీడియో చాటింగ్‌ చేస్తుండం. కానీ..ఇప్పుడు ఒకేసారి ఆరుగురి వరకూ వీడియో కాల్‌ చేసి మాట్లాడుకునే సదుపాయం వచ్చింది. కాల్ మాట్లాడుతున్న సమయంలో మీకేదో ఆసక్తికరంగా అనిపించిన ఒక విషయాన్ని కాల్‌లో ఉన్న మీ మిత్రులకు చూపించాలనుకున్నారు. అలాంటప్పుడు స్ర్కీన్‌ షేరింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఆలా షేర్ చేయడం వీలు పడుతుందా?..ఇప్పటివరకూ కష్టమే! కానీ ఓ యాప్‌ దాన్ని సుసాధ్యం చేసింది. దీని పేరు “స్క్వాడ్‌”. ఫోన్‌లో ఏదైతే చూస్తున్నామో దాన్ని స్ర్కీన్‌ షాట్‌ తీసి పంపించడం జరుగుతుండేది.

కొన్నేళ్ల క్రితమే ఈ ప్రక్రియఫై కాఫర్డ్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కి విసుగొచ్చింది. అతని కూతురు కూడా నా ఫ్రెండ్స్‌కి నేను చూస్తున్నప్పుడు అప్పటికప్పుడు ఎందుకు షేర్‌ చేయడానికి కుదరదు…అంటూ అడిగేది. అప్పుడు క్రాఫర్డ్‌కి పుట్టిన ఆలోచనే ‘స్క్వాడ్‌’. ఈ యాప్‌ ఓపెన్‌ చేసి అందులో వీడియో కాల్‌ మాట్లాడం మొదలుపెట్టండి. మీరు చూస్తున్నది వారికీ చూపించాలంటే, ఆప్షన్లలో ఉండే స్ర్కీన్‌షేర్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేసి మీరు పంపించాలనుకున్న సమాచారాన్ని సులువుగా  స్ర్కీన్‌షేర్‌ ద్వారా పంపుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ యాప్‌ ఐఫోన్‌ వినియోగదారులకే అందుబాటులో ఉంది.

leave a reply