క్యాన్సర్‌కు కారణాలు ఇవే..

క్యాన్సర్‌ అనే వ్యాధి గురించి తెలియని వారుండరు. క్యాన్సర్‌ వస్తే మనిషి బతకడం చాలా కష్టమని మనకు తెలిసిన విషయమే. అలా అయితే ముందే తెలుసుకోవచ్చా అంటే అదీ కష్టమేనట. వ్యాధి ముదిరేవరకు ఈ ఛాయలు బయటపడవని డాక్టర్స్‌ చెప్తున్నారు. పెద్ద పెద్ద సెలెబ్రెటీలలో కూడా క్యాన్సర్‌ వచ్చి మరణించిన వారున్నారు. ప్రజెంట్‌ ఉన్న జనరేషన్‌లో క్యాన్సర్‌ వ్యాధి ఓ మహామ్మారిలా వ్యాపిస్తున్నది. మ‌న చుట్టూ ఉండే వారో లేక తెలిసిన వారో ఎవ‌రో ఒక‌రు క్యాన్స‌ర్ బారిన ప‌డుతున్నార‌నే వార్త‌ల‌ను మ‌నం వింటూనే ఉంటాం. అలాగే క్యాన్సర్‌ను నిరోధించే చికిత్సలు, మందులు కూడా వచ్చాయని మనకు తెలుసు కాని వాటిపై నమ్మకం తక్కువ. అలాగే అది ఎక్కువ ఖర్చుతో కూడికున్న పని.

క్యాన్సర్‌ రావడానికి అనేక రకమైన కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఆహారం, గాలి, నీరు. ప్రస్తుతం అంతా కాలుష్యమయం. గాలి ఏ స్థాయిలో కాలుష్యం అవుతుంతో ఉదాహరణగా ఢిల్లీ ప్రాంతాన్ని చూడవచ్చు. ఇక ఎంతో కొంతైనా మనం కలుషితమైన ఆహారాలు తింటూనే ఉంటున్నాం. తాగే నీరు కూడా కాలుష్యానికి గురి అవుతూనే ఉంది. అయితే.. ఇవే కాకుండా.. స‌రైన పోష‌కాలు ఉన్న ఆహారం నిత్యం తీసుకోక‌పోయినా క్యాన్స‌ర్ వ‌స్తుంద‌ట‌. వీటి గురించి అంద‌రూ తెలుసుకుంటే క్యాన్స‌ర్ రాకుండా అడ్డుకోవ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాద‌ని అంటున్నారు డాక్టర్స్‌.

మ‌ల‌బ‌ద్ద‌కం, అసిడిటీ, నిద్ర, ఎక్కువసేపు కూర్చుని ఉండ‌డం, ఒత్తిడి ఇవే ఎక్కువ కారణాలుగా సైంటిస్టులు నిరూపణ చేశారట. అలాగే సమయానికి నిద్ర, తిండి లేకపోతే చాలా ప్రమాదాలకు గురి కావాల్సి వస్తుందని సైంటిస్టులు కొన్ని ప్రయోగాల ద్వారా తెలుసుకున్నారట.

అలాగే.. క్యాన్సర్‌ను నిలువరించడంలో పసుపు ప్రధానమైన పాత్ర పోషిస్తుందని క్యాన్సర్‌ పరిశోధకులు తెలిపారు. కొన్ని వంటకాలలో పసుపును కూడా వాడటం చాలా మంచిదని తెలియజేశారు. పసుపుకు క్యాన్సర్‌ కణాలను తుదముట్టించే సామర్థ్యం ఉన్నట్లు, పసుపులో ఉండే కర్కుమిన్‌ అనే రసాయనానికి 24గంటల్లోపే క్యాన్సర్‌ కణాలను చంపే శక్తి ఉన్నట్టు పరిశోధకులు తేల్చారు. కర్కుమిన్‌కు గాయాలు నయం చేయడంతోపాటు, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించే శక్తి పసుపుకు ఉంటుందట. కాన్సర్ మన శరీరంలో ఏ భాగానికైనా వచ్చే ప్రమాదం ఉంది. అయినా గర్భాశయం, రొమ్ము కాన్సర్, ఊపిరితిత్తులు, పేగులు, శ్వాస నాళాలు మొదలైన భాగాలకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువ.

మనిషిగా జీవించే ఛాన్స్‌ మళ్లీ మళ్లీ రాదు.. వచ్చినా మనకు గుర్తుండదు కాబట్టి.. వీలైనంత వరకూ హెల్దీగా, హ్యాపీగా ఉండేలా చూసుకోండి.

leave a reply