ఇపుడు ఏ ఇండస్ట్రీలో చుసిన బయోపిక్‌లకు మంచి ఆదరణ లభిస్తుంది. సౌత్‌లో మహానటి సినిమాతో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా అన్ని చోట్ల మంచి గిరాకీ ఏర్పడింది. ప్రస్తుతం బాలీవుడ్లో ఝాన్సీ లక్ష్మీభాయి జీవితచరిత్రపై తెరకెక్కించిన మణికర్ణిక రిలీజ్‌కు రెడీ అవ్వగా… అటు టాలీవుడ్ మరో క్రేజీ ప్రాజెక్ట్ “ఎన్టీఆర్” రొండు భాగాలుగా విడుదలకు సిద్ధమైంది. ఇప్పుడు అలాగే మరో క్రేజి బయోపిక్ తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. చాయ్‌వాలా నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన నరేంద్ర మోదీ జీవితాన్ని తెరపైకి తెచ్చేందుకు బాలీవుడ్ సిద్దమైంది.
ఈ చిత్రానికి పీఎం:నరేంద్ర మోదీ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రధాని మోదీ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని బాలీవుడ్ ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ప్రకటించాడు. ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రం సందీప్ సింగ్ ఈ నిర్మిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి 15 నుంచి ప్రారంభంకానున్నట్లు సమాచారం. ఈ చిత్రనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను జనవరి 7న విడుదల చేయనున్నట్లు సమాచారం.