ఒంటరిగా ఉన్నారా..? ఏం చేయాలంటే

సాధారణంగా చాలామంది తాము ఒంటరివాళ్లమని, ఎవరకూ అండగా లేరని బాధపడుతూంటారు. ఇలాంటి వ్యక్తులను ఉద్దేశించి రామ్ గోపాల్ వర్మ ఈరోజు ట్విట్టర్‌లో స్పందించారు. అందులో ‘మీకు జీవితంలో ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నామనీ, మన వెనుక ఎవ్వరూ లేని అనిపించిందనుకోండి. వెంటనే ఒంటరిగా కూర్చుని ఓ హర్రర్ సినిమా చూడండి.. అప్పటి నుంచి మీ వెనుక ఎవరో ఉన్నారని మీరు ప్రతీక్షణం ఫీల్ అవుతారు’ అంటూ సరదాగా ట్వీట్ చేశారు. వర్మ ప్రస్తుతం ఎన్టీఆర్ జీవితంపై ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో బయోపిక్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఎప్పుడూ హాట్‌ హాట్‌గా, ఎదుటివారిని ఉద్దేశించి ట్వీట్‌ చేసే వర్మ ఇలా సరదాగా ట్వీట్‌ చేయడం చాలా ఆసక్తిగా ఉందని, హ్యాపీగా ఉందని నెటిజన్లు రిప్లై ఇస్తున్నారు.

leave a reply