‘లవర్స్‌ డే’ సినిమా రివ్యూ

ఒక్క కన్నుగీటుతో కుర్రకారు మదిల్లో చెరిగిపోని ముద్ర వేసింది మలయాళ నటి ప్రియా వారియర్‌. గన్‌ షూట్‌తో రాత్రికిరాత్రే ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఓ స్టార్‌ గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత లాంచ్‌ చేసిన టీజర్‌లో కూడా తన యాక్టింగ్‌తో అందరినీ కట్టిపడేసింది. ఈమె తమిళంలో నటించిన మొదటి సినిమా ‘ఒరు అడార్‌ లవ్‌’ పలు భాషల్లో విడుదల అవుతుంది. తెలుగులో ‘లవర్స్‌ డే’గా ప్రేమికుల రోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే స్టోరీ ఏంటో తెలుసుకోవాల్సిందే.

స్టోరీ : ఇంట‌ర్‌మీడియట్ కాలేజీ నేప‌థ్యంలో సాగే ప్రేమకథ ఇది. రోష‌న్, ప్రియా, గాథ జాన్, మాథ్యూ, ప‌వ‌న్ వీళ్లంతా  డాన్ బాస్కో హ‌య్య‌ర్ సెకండ‌రీ స్కూల్లో చ‌దువుతుంటారు. ప్రియ‌ను ఆట‌ప‌ట్టించాల‌ని రోష‌న్ ఆమెను టీజ్ చేస్తాడు. క్ర‌మంగా అది వారిద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌కు దారి తీస్తుంది. వాళ్లిద్ద‌రూ ప్రేమించుకుంటున్న విష‌యం స్కూల్లో అంద‌రికీ తెలిసిపోతుంది. కాగా.. వాట్సప్‌లో పంపించిన కొన్ని వీడియోల వల్ల ప్రియ రోషన్‌కి బ్రేకప్‌ చెబుతుంది. విడిపోయిన వీళ్లను కలపాలని రోషన్‌ ఫ్రెండ్స్‌ అందరూ ప్లాన్‌ చేసుకుంటారు. అనుకున్నట్టుగానే, ప్రియాలో ఈర్ష్య క‌లిగించాల‌ని స్నేహితులంతా క‌లిసి గాథ, రోష‌న్‌లు ప్రేమలో ప‌డిన‌ట్టుగా న‌టించాల‌ని చెబుతారు. కొన్నాళ్ల‌ త‌ర్వాత  ఆ ఇద్దరి మ‌ధ్య నిజంగానే ప్రేమ పుడుతుంది. అది ఎక్క‌డిదాకా దారి తీసింది? రోషన్‌, ప్రియా, గాథ‌ల ముక్కోణ‌పు ప్రేమ‌క‌థ‌లో ఎలాంటి మ‌లుపులు చోటు చేసుకున్నాయ‌న్న‌ది తెర‌పైనే చూడాలి.

ఎలా చేశారంటే ‌: రోషన్‌, ప్రియ, ఇంకా గాథ, పవన్‌ అందరూ వాళ్ల వాళ్ల పాత్రలకు తగ్గట్టూగానే యాక్టింగ్‌ చేశారు. ఇక ప్రియా వారియర్‌ బయట అభిమానులను ఎలా అలరించిందో.. ఈ సినిమాలో కూడా అలాగే ప్రియా, రోషన్‌లు చేశారు. వీళ్లద్దరి మధ్య లవ్‌ సీన్స్‌ బాగా పండాయి. ఇక గాథ ప్రియకు ఈర్ష్య కలిగిద్దామని నటించి, చివరకు ప్రేమికురాలుగా మారడంలో వేరియేషన్స్‌ చూపించింది.

చివరకు:  కాలేజీలో నడిచే స్టోరీలు కాబట్టి మనకు కొత్తగా ఏమీ అనిపించదు. పాత సినిమాలు గుర్తువచ్చేటట్టుగా స్టోరీ ఉంది. సినిమాకు కావాల్సిన స్టోరీ ఏం లేదు. అక్కడక్కడా సినిమా సింక్‌ కాలేదని పిస్తుంది. కామెడీ చేయాలని ట్రై చేసినా అది పెద్దగా హిట్‌ కాలేదు. రోషన్‌ ఎందుకు పోలీసులు, ప్రిన్సిపాల్‌ ముందు దోషిగా నిలుచోవల్సి వస్తుందో ఆ సీన్‌ను హైలెట్‌ చేయలేదు. రోషన్‌, ప్రియల బ్రేకప్‌ ఎందుకు చేసుకుంటారో హార్ట్‌ టచ్చింగ్‌గా చూపించలేదు. కానీ సినిమాలోని లాస్ట్‌ సీన్స్‌ మాత్రం ఊహించని విధంగా ఉంటుంది.

leave a reply