నిహారిక పెళ్లిపై క్లారిటీ

నిహారిక పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మెగా బ్రదర్‌ నాగబాబు. నిహారికాకు యాక్టింగ్‌ అంటేనే ఎక్కువ ఇష్టమని చెప్పింది.. అందుకే ఇంత టైం వరకూ వెయిట్ చేశాము. కానీ.. నిహారికాకు ఇచ్చిన టైం అయిపోయింది. 2018 వరకు అమ్మాయికి టైమ్‌ ఇచ్చా. 2019 వచ్చింది.. మంచి సంబంధం వస్తే పెళ్లి చేసేస్తా అని అన్నారు నాగబాబు. వెతుకుతున్నామని సీనియర్‌ నటుడు నాగబాబు అన్నారు. నాకు కులం, మతం గురించి పట్టింపు లేదని, మంచి గుణం కలిగిన అబ్బాయి కోసం వెతుకుతున్నామని అన్నారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో నిహారికా పెళ్లి మేటర్‌ గురించి అడగగా అందుకు ఈ విధంగా సమాధానమిచ్చారు. కాగా.. ప్రస్తుతం నిహారికా ‘సూర్యాకాంతం’ సినిమా చేస్తోంది. దీనిని వరుణ్‌తేజ్‌నే నిర్మిస్తున్నారు.

leave a reply