గుడివాడలో అవినాష్.. రాష్ట్రం లో బాబు.. గ్యారెంటీ..!

టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మా కొడాలి నాని పై నిప్పులు చెరిగింది. ఆమె మాట్లాడుతూ.. కొడాలి నాని రెండు సార్లు టీడీపీ నుండి గెలిచారని ఆమె గుర్తు చేశారు. రెండు సార్లు టీడీపీ నుండి గెలిచి ఇప్పుడు టీడీపీ నే విమర్శించడం దారుణం అని ఆమె అన్నారు. నాని తిన్నింటి వాసాలు లెక్కేబెట్టే వ్యక్తి అని ఆమె అన్నారు. టీడీపీ పార్టీ వాళ్ళు నాని ప్రజలకి దేగ్గరయ్యాడు రెండు సార్లు గెలిచి వైసీపీ కి వెళ్ళాడు.. ఎవరైనా తిన్నింటి వాసాలు లెక్కబెడతారా అని ఆమె ప్రశ్నించారు.

ప్రజలు నానికి ఓటేసి గెలిపిస్తే ఆయన వీధి రౌడీలా తయారయ్యాడు అని ఆమె విమర్శించింది. గుడివాడ నుండి ఆయనని నమ్మి అస్సెంబ్లీకి పంపితే.. ఏనాడు ఆయన అసెంబ్లీ లో మాట్లాడలేదని ఆమె గుర్తు చేసింది. గుడివాడ అభివృద్ధి చెందకపోడానికి నాని ఏ ముఖ్య కారణం అంటూ ఆమె నాని నీ దుయ్యబట్టింది. అవినాష్ కి నానికి మధ్య తేడాని గమనించి ప్రజలు ఓటు వెయ్యాలి.. గుడివాడ లో టీడీపీ ని గెలిపించి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలి అని ఆమె ప్రజలని కోరింది.

ఇక ఆమె జగన్ కుటుంబం గురించి వైఎస్ శర్మిలా గురించి మాట్లాడుతూ వారిపై విమర్శలు చేసింది. ప్రజలు ఎవరైనా అభివృద్ధి గురించి మాట్లాడితే జగన్ కుటుంభం సహించలేదు అని ఆమె విరుచుకపడింది. ఇక శర్మిలా గురించి మాట్లాడుతూ.. 5 సంవత్సరాల లో ఏనాడు ప్రజల గురించి పట్టించుకోలేదు,నేడు ఓట్లు కోసం రావటం సిగ్గుచేటు. షర్మిల రాష్ట్రంలో వలస పక్షిలాగా తిరుగుతుంది అంటూ ఆమె పై విమర్శలు చేసింది. జగన్ కి ఒక్కసారి అవకాశం ఇవ్వటానికి ఇదేమి లాటరీ టిక్కెట్లాట కాదు.. చంద్రబాబు కి పట్టం కట్టడానికి రాష్ట్ర ప్రజలు అందరూ సిద్ధంగా ఉన్నారు.. రాష్ట్రంలో చంద్రబాబు, గుడివాడలో అవినాష్ ప్రభంజనం సృష్టిస్తారు.

leave a reply