టీడీపీతో పెట్టుకుంటే మూలాలు కదిలిపోతాయ్ – చంద్రబాబు

చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు మదనపల్లి బహిరంగ సభలో మాట్లాడుతూ తమ ప్రభుత్వానికి సంబంధించిన డేటాను తాము కాపాడుకోగలమని అన్నారు. తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికీ, పార్టీ డేటాను వైసీపీకి ఇవ్వడానికే తెలంగాణ పోలీసులు దాడులు చేశారని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఆ డేటా ఆంధ్రప్రదేశ్ ఆస్తి అనీ, దీనిపై విచారణ చేయడానికి మీరు ఎవరని ప్రశ్నించారు. ఏపీ డేటా హైదరాబాద్ లో ఉంటే వెంటనే తమకు పంపించాలని సూచించారు. ఈ విషయంలో ఎవ్వరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

కేసీఆర్‌తో జగన్ కుమ్మక్కై టీడీపీని దెబ్బతీయాలని అనుకుంటున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.మీ మూలాలు కదిలిపోతాయని, ఎక్కడా తిరిగే పరిస్థితి ఉండదని చంద్రబాబు హెచ్చరించారు. ఏదైనా చట్టపరంగా తాను ముందుకు వెళతానని అన్నారు.ఎవడో దారినపోయే దానయ్య పిర్యాదు చేస్తే సాఫ్ట్ వేర్ కంపెనీలపై దాడులు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు.తెలంగాణలో ఉంది ప్రజాస్వామ్యమా? పోలీసు రాజ్యమా? అని అడిగారు. కేసీఆర్ ఒక నియంత అనుకుంటున్నారని, అది తనవద్ద పనిచేయదని, ఈ విషయం కేసీఆర్ గుర్తుంచుకోవాలి అని అన్నారు. ఏపీ అభివృద్ధికి అడ్డుపడితే వదిలిపెట్టే సమస్యే లేదన్నారు.

leave a reply