లోక్‌సభ ఎన్నికల్లో…కమల్!

ఇటీవల తమిళనాడులో జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలలో పార్టీ ఫిరాయించిన 20 మంది ఎమ్మెల్యేల పై అనర్హత వేటు పడ్డ  దృష్ట్యా  ఆ 20 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే తమ పార్టీ పోటీ చేస్తుందని కమల్ హాసన్ ప్రకటించారు. కమల్ హాసన్ ప్రస్తుతం పార్టీ పెట్టి తమిళనాడు రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ వచ్చే సార్వత్రిక ఎన్నికల పై తనకున్న ఆసక్తిని ప్రదర్శించాడు. తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కమల్ హాసన్ మాట్లాడుతూ.. ‘2019 లోక్‌సభ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తా అని చెప్పారు.ఎన్నో ఆసక్తికర విషయాలు విషయాలు పంచుకున్నారు.
మక్కల్‌ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) పార్టీ అభ్యర్థులను ఎంచుకొనే ప్రక్రియలో భాగంగా త్వరలోనే కమిటీని ఏర్పాటు చేయబోతున్నాం  అని కమల్‌ చెప్పుకొచ్చారు. తమిళనాడు ప్రజల అభివృద్ధే ధ్యేయంగా తమ పార్టీ వ్యూహాలు ఉండబోతున్నాయి అని చెప్పారు. ఈ సందర్భంగా పొత్తుల అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. తమిళనాడు డీఎన్‌ఏను మార్చేందుకు ప్రయత్నించే ఏ పార్టీతోనూ తాము పొత్తు పెట్టుకోబోమని కమల్‌ స్పష్టం చేశారు.అంతే కాకుండా కూటముల గురించే ఇప్పుడే చెప్పలేమని వివరించారు ఈ ఏడాది ఫిబ్రవరిలో కమల్‌హాసన్‌ మక్కల్‌ నీది మయ్యం పార్టీని ప్రారంభించిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే యోచనలో ఉన్నట్లు గత కొంతకాలంగా చెబుతూ వస్తోన్న కమల్‌ ఆ అంశంపై ఈ రోజు ఓ స్పష్టత ఇచ్చారు.తన తరువాత కార్యాచరణ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.

leave a reply