నారా రోహిత్ వస్తున్నాడు.. 3 నుండి క్యాంపెయిన్..!

టీడీపీ తరఫున సినీ నటుడు చంద్రబాబు తమ్ముడి కొడుకు నారా రోహిత్ ప్రచారం చేయన్నున్నాడు. ఈ నెల 3న ఈయన ప్రచారం మొదలుకానుంది. ఈ నెల మూడు నుండి 9 వ తేదీ వరకు రోహిత్ ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే పూర్తిగా షెడ్యూల్ సిద్ధమయ్యింది.

మూడో తేదీన కొవ్వూరు, రాజమండ్రి, గోపాలపురం నియోజకవర్గాల్లో, నాలుగో తేదీన సత్తెనపల్లి, గుంటూరు, తణుకు, గురజాల నియోజకవర్గాల్లో, ఐదో తేదీన తెనాలి, రేపల్లె, పత్తిపాడులో, ఆరో తేదీన చీరాల, చిలకలూరిపేట, పర్చూరులో, ఏడో తేదీన ఉరవకొండ, పుట్టపర్తి, రాయదుర్గం, ఎనిమిది, తొమ్మిదో తేదీన చిత్తూరు జిల్లాలో నారా రోహిత్ ప్రచారం చేయనున్నారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.

leave a reply