కివీస్ ఆశలు…ఆవిరి!

న్యూజిలాండ్ వన్డే సిరీస్ లో టీమిండియా దూకుడు కొనసాగించింది. భారత్‌- న్యూజిలాండ్‌ల మధ్య జరిగిన రెండో వన్డేలో టీమిండియా తన సత్తా చాటింది..కోహ్లీసేన నిర్దేశించిన 325 పరుగుల లక్ష్యాన్నిచేధించే క్రమంలో కివీస్‌ చతికిలపడింది. టీమిండియా బౌలర్ల ధాటికి కివీస్ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్ బాట పట్టింది.  ఈ మ్యాచ్ లో టీంఇండియా 90 పరుగుల తేడాతో గెలిచింది. బౌలర్లు రాణించడంతో కోహ్లీసేనకు సునాయాస విజయం దక్కింది. కుల్‌దీప్‌ యాదవ్ నాలుగు వికెట్లు, చాహల్‌, భువి చెరో రెండు వికెట్లు, షమీ, జాదవ్‌ చెరో వికెట్‌ తీయడంతో కివీస్ 234 పరుగులకే కుప్పకూలింది.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన టీమిండియాకు ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చార.ఓపెనర్లు రోహిత్ శర్మ‌(87; 96 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు), శిఖర్‌ ధావన్‌(66; 67 బంతుల్లో 9 ఫోర్లు)తో  హాఫ్‌ సెంచరీలు చేయగా… వీరికి తోడుగా  విరాట్‌ కోహ్లి(43; 45 బంతుల్లో 5 ఫోర్లు) , అంబటి రాయుడు(47; 49 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌), ఎంఎస్‌ ధోని(48 నాటౌట్‌;33 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌)లతో కివీస్ ఫై విరుచుకుపడడంతో  టీమిండియా 325 పరుగుల భారీ లక్ష్యాన్ని చేరింది.

లక్ష్య ఛేదనలో ధాటిగా బ్యాటింగ్‌ ఆరంభించిన కివీస్‌ ఆదిలోనే మార్టిన్‌ గప్టిల్‌(15) వికెట్ భువనేశ్వర్ పడగొట్టాడు. ఆ తర్వాత భారత బౌలర్ల ధాటికి ఒక్కరిగా పెవిలియన్ బాట పట్టారు. అయితే బ్రాస్‌వెల్‌(57; 46 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించినప్పటికీ  టాప్ ఆర్డర్ విఫలమవడంతో కివీస్‌ను గెలిపించలేకపోయాడు. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ నాలుగు వికెట్లు దక్కగా , భువనేశ్వర్‌ కుమార్‌, చహల్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టారు. షమీ, కేదర్‌ జాదవ్‌లకు చెరో వికెట్‌ దక్కింది. దీంతో టీమిండియా ఐదు వన్డేల సిరీస్‌లో 2-0 ఆధిక్యంతో ఉంది. 

leave a reply