అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది

సంప్రదాయ ఫలంగానూ నీరాజనాలందుకునేది ఖర్జూరమే. రంజాన్‌ మాసం వచ్చిందంటే చాలు, పరిపుష్టికరమైన ఆ పండుతోనే ముస్లింలకు ఉపవాసదీక్ష పూర్తవుతుంది. అందుకే వారికిది లేనిదే పొద్దు గడవదంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఖర్జూరంలో ఎన్నో రకాల పోషకాలు కలవు. వీటిలో ఐరన్‌ పుష్కలంగా లభిస్తుంది. నీరసంగా, బలహీనంగా ఉండే వారు ఖర్జూరం రోజూ తింటే దాని నుంచి కోలుకోవచ్చు. ఖర్జూరాన్ని ఎన్నో రాకాలుగా ఆహార పదార్థాలలో ఉపయోగిస్తారు. వంటలు, జ్యూసస్‌, కేక్స్‌, ఫ్రూట్‌ సలాడ్స్‌ వంటి వాటిల్లో ఉపయోగిస్తారు.

ప్రకృతి సిద్ధంగా లభించే గ్లూకోజ్‌ ఫ్రక్టోజ్‌లు వీటిలో ఉంటాయి. ఖర్జూరాలను మెత్తగా రుబ్బి నీళ్ళల్లో రాత్రంతా నానబెట్టిన తర్వాత వీటిల్లోని విత్తనాలను తొలగించి కనీసం వారానికి రెండు సార్లు తీసుకుంటే మంచి ఆరోగ్యం లభిస్తుంది. చిన్న ప్రేగుల్లో చోటు చేసుకునే సమస్యలకు వీటివల్ల మంచి పరిష్కారం లభిస్తుంది. ఇందులో మంచి పోషకాహార విలువలు కలిగి ఉంటాయి. ఖర్జూరాల వల్ల మాంగనీస్‌, రాగి, పొటాషియం, విటమిన్‌ బి6 ఫైబర్‌ వంటివన్నీ మనకు లభిస్తాయి.

తక్షణ శక్తి కోసం ఖర్జూరం బాగా ఉపయోగపడుతుంది. మన శరీరానికి కావాల్సిన కీలకమైన మినరల్స్‌ విటమిన్స్ ఇందులో లభ్యమవుతాయి. రేచికటి సమస్యలు ఉంటే అవి సత్వరగా మెరుగవుతాయి. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ పోయి, మంచి కొలెస్ట్రాల్‌ వృద్ధి చెందుతుంది. జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. బాగా ఆలోచించగలుగుతారు. గర్భిణిలు రోజూ ఖర్జూరం తీసుకోవడం చాలా మంచిది. ఖర్జూరం తినడం వల్ల రక్తప్రసరణ అద్భుతంగా పనిచేస్తుంది. బీపీ, షుగర్‌లను అదుపులో ఉంచుతుంది. కీళ్లవాపు సమస్యలను తగ్గిస్తుంది. సో.. రోజుకో ఖర్జూరం తిన్నా మంచి లాభాలను మీరు చూడవచ్చు.

leave a reply