120 చలాన్లు… కారు సీజ్!

ట్రాఫిక్ నిబంధలను ఉల్లగించిన ఒక క్యాబ్ డ్రైవర్…అతని ఖాతాలో ఉన్న చలాన్లను చూసి ఖంగుతిన్న పోలీసులు. అతడు ఎక్కువగా గచ్చిబౌలి-శంషాబాద్‌ మార్గంలో ప్రతిరోజు తన క్యాబ్ నడుపుతుంటాడు. గచ్చిబౌలి చౌరస్తాలో సోమవారం ట్రాఫిక్‌ పోలీసులు విధులు నిర్వర్తిస్తుండగా… రోడ్డుపై అతని కారు  ‘నో పార్కింగ్‌’ ప్రాంతంలో ఆగి ఉండటంతో అది గమనించిన పోలీసులు కారుపై ఉన్న చలాన్లను పరిశీలించగా మొత్తం 120 చలాన్లు పెండింగ్ ఉండటంతో కారును సీజ్ చేసారు. ఈ చలాన్లు నో పార్కింగ్‌, అతివేగం, సీటుబెల్టు పెట్టుకోకపోవడం వంటి కారణాలపై వేయడం జరిగింది.

ఈ చలాన్ల మొత్తం కలిపి 19,930 రూపాయల వరకు చెల్లించాల్సి ఉండటంతో సోమవారం పోలీసులు అతని కారును సీజ్‌చేశారు. అతని వాహనాన్ని సీజ్‌ చేసిన పోలీసులు డ్రైవర్‌ రమేష్‌కు పత్రాలు అందించారు. సాధారణంగా చలాన్లు పది కంటే ఎక్కువగా  పెండింగ్‌లో ఉన్న వాహనాలను సీజ్‌ చేస్తామని ట్రాఫిక్‌ ఎస్‌ఐ రఘకుమార్‌ పేర్కొన్నారు.

leave a reply