ఎట్రాక్టీవ్‌గా..

పార్టీలు కాని.. ఫంక్షన్స్‌ కాని.. ఏదైనా మనమే అందరికన్నా.. స్పెషల్‌గా.. ఎట్రాక్టీవ్‌గా, డిఫ్‌రెంట్‌గా కనిపించాలనుకుంటారు ఆడవాళ్లు. కాని.. ఓక్కోచోట ఒక్కోరకమైన దుస్తులు కావాలి.. సపోజ్‌ ఆఫీస్‌లకి ఒకలా.. ఇంటి దగ్గరున్నప్పుడు క్యాజువల్‌గా..  చిన్న బర్త్‌డే ఫంక్షన్స్‌కి ఒకలా.. ఇలా దేనికి తగ్గట్టు దానికి డ్రెస్సెస్‌ సెలెక్ట్‌ చేసుకుంటాం.

పార్టీవేర్‌ అనగానే లెహెంగాలు, అనార్కలీలు, పట్టు చీరలు, పరికిణీల ధగధగలే ఎక్కువగా కనిపిస్తాయి. కాలేజీలో ఫేర్‌వెల్‌ పార్టీ, స్నేహితులతో కలిసి ఆనందించే సందర్భం ఏదైనా సరే! కాస్త ప్రత్యేకంగా కనిపిస్తేనే కదా… మనదైన స్టైల్‌.

మాక్సిమమ్‌ బాటమ్‌, టాప్‌ ఏదైనా రెండూ ఒకే రంగుల్లో లేకుండా చూసుకోవాలి.

ఇప్పుడు ఏదైనా మ్యాచింగ్‌ కాకుండా కాంట్రాస్ట్‌లు వాడటం ఫ్యాషన్‌ అయింది. శారీస్‌, లెహంగాస్‌, చుడీస్‌ ఏదైనా ఇప్పుడున్న యూత్‌కి సింపుల్‌గా ఎట్రాక్టీవ్‌గా ఉండాలి.

పొడవాటి స్కర్టుకు ఒకవైపు డ్రేప్‌ డిజైన్‌ కోసం చిన్నచిన్న ప్లీట్స్‌ పెట్టించుకోవచ్చు. దాని మీదకు బ్యాట్‌ స్లీవ్స్‌తో టాప్‌ లేదా పెప్లమ్‌ క్రాప్‌ టాప్‌ని ఎంచుకోవచ్చు. వీటిని చీరల మీదకు వేసుకునే బ్లౌజులను జతచేసుకోవచ్చు. అంతేకాదు సన్నగా తీరైన ఆకృతితో కనిపించాలనుకునేవారికి ఈ రకం బాగుంటాయి

ఏ సందర్భానికైనా స్టైలిష్‌గా కనిపించే మరో ప్యాటర్న్‌ హై అండ్‌ లో. దీనిలో హెమ్‌ డ్రెస్‌ వావ్‌ అనిపిస్తుంది. పొట్టభాగం దగ్గర చిన్న చీలికతో డిజైన్‌లా చేసిన జంప్‌ సూట్‌ ఆఫీస్‌ వేర్‌గా అదిరిపోతుంది. కాలేజీ వేడుకల్లో అయితే దీంతో కనికట్టు చేయవచ్చు. దీనిలో బాటిల్‌ గ్రీన్‌ రంగుని ఎంచుకుంటే సిల్వర్‌ వాచ్‌, షూస్‌, చెవులకు లోలాకులు…మెరిపిస్తాయి.

సాధారణ కుర్తీనే ఎసెమెట్రికల్‌ కట్‌లో కుట్టించుకోవచ్చు. దీనికి స్లీవ్స్‌లో రఫుల్స్‌ ప్రయత్నించవచ్చు. అలానే కాస్త పొడవాటి గౌన్‌కి గేరాతో పాటు అడుగు భాగంలో అంచు రఫుల్స్‌ని కుట్టించుకుంటే ఏ వయసు వారికైనా చక్కగా నప్పుతుంది.

ఇక జీన్స్‌ అయితే సన్నగా ఉన్నవారికి మంచి ఔట్ ఫిట్‌ అని చెప్పవచ్చు. అలాగే బొద్దుగా ఉన్నవారు కూడా కొంచెం లూజ్‌ షర్ట్స్‌ కాని, టాప్స్‌ కాని సెలెక్ట్‌ చేసుకోవచ్చు. అమ్మాయిలు జీన్స్‌ ఇనషర్ట్స్‌ చేసుకుని కారీ చేస్తే అబ్బాయిలు చూపు తిప్పుకోనవసరం లేదు.

సాధారణ షిఫాన్‌ వస్త్రాన్ని కూడా స్ట్రెయిట్‌ కట్‌ డ్రెస్‌లా కుట్టించుకుని ఒకవైపు కుచ్చిళ్లు కుట్టిస్తే ఎంత కళగా ఉంటుందో! దీనికి మెటాలిక్‌ జిప్‌ అదనపు అందాన్ని తెచ్చిపెడుతుంది.

ఇక రంగులంటారా… ఎరుపు, నీలం, ఆకుపచ్చ వంటి ప్రాథమిక రంగులు కాకుండా బాటిల్‌గ్రీన్‌, బ్లష్‌, పీచ్‌, పర్పుల్‌ వంటివాటితోపాటు పేస్టల్‌ రకాలని మేళవింపుగా వాడుకుంటే మీ వేషాధారణ పూర్తిగా మారిపోతుంది.

leave a reply