కొరటాల , ఎన్టీఆర్ కాబినేషన్లో..మరో సినిమా!

ప్రస్తుతం చిరు సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్లో  ఉన్నసంగతి తెలిసిందే. తరువాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకేక్కబోయే  చిత్రంలో తన 152వ సినిమా ఉండబోతుంది. కొరటాల కూడాఈ సినిమాకి సంబంధించిన పనిలోనే ఉన్నారు. ఇక సినిమా విషయానికొస్తే చిరంజీవి అభిమానులకు తగ్గట్టుగా ఉండే విధంగా కథను సిద్ధం చేస్తున్నారు. దాని కోసం ప్రత్యేక శ్రద్ధతో కథను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా కొరటాల తన మరో  ప్రాజెక్టును రెడీ చేసుకుంటున్నాడు. ఈ కధకు ఎన్టీఆర్ ను హీరోగా తీసుకోబోతున్నట్లు సమాచారం.

చిరుతో సినిమా పూర్తి అవగానే తన తరవాత సినిమా  ఎన్టీఆర్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. కొరటాల , ఎన్టీఆర్ కాబినేషన్లో వచ్చిన “జనతా గ్యారేజ్” మంచి విజయం సాధించింది. మళ్ళి అదే కాబినేషన్లో  సినిమా అనగానే భారీఅంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ కూడా  గ్రీన్ సిగ్నల్ఇచ్చేశాడని సమాచారం. ఈ సినిమాకి కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా వ్యవహరించనున్నట్టు చెబుతున్నారు. కొరటాల.. సుధాకర్ ఇద్దరూ కలిసి భవిష్యత్తులో చిన్నసినిమాలు నిర్మించాలనే ఆలోచనలో  కూడా ఉన్నారట.

leave a reply