అమ్మాయిలకు మేకప్ సర్వసాధారణం. ఏదైనా అకేషన్స్‌కు, పార్టీలకు మేకప్ కంపల్సరీ ఉండాల్సిందే. అలాగే అమ్మాయిల బ్యాగుల్లో లిప్ట్ స్టిక్స్, ఐ లైనర్స్, పౌడర్ పాడ్స్, కోంబ్స్ కనిపిస్తూ ఉంటాయి. కానీ వీటిని ఎంతవరకూ వాడుతున్నారు అనేదే ఇప్పుడు పాయింట్. కాస్మొటిక్స్ కొంటే, అవి అయుపోయేవరకూ వాడవచ్చు అనుకుంటే పొరపాటే. మందుల్లాగే వాటికీ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. కాబట్టి సౌందర్య సాధనాల వాడకంలో వాటి షెల్ఫ్‌లైఫ్ గమనించుకోవాలి. కాస్మోటిక్స్ పై ఎక్స్‌పైరీ డేట్‌ను కంపల్సరీ గమనించుకోవాలి. లేదంటే అది మన ముఖ కవలికలనే మార్చేస్తుంది. రకరకాల వ్యాధులు కూడా సంభవించే అవకాశముంది. కాస్మోటిక్స్ ఎక్కువగా వాడినా కూడా ప్రమాదం సంభవించవచ్చు. వీటి వల్ల ఎక్కువగా క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించాలి. అలాగే.. వాటిని ఎక్కడపడితే అక్కడ పడేయవద్దు. వాటికంటూ ఒక పౌచ్‌ను యూజ్ చేస్తూ ఉండాలి. అలాగే రోజూ వాటిని క్లీన్ చేసుకుంటూ ఉండాలి.
మని ఏ ఏ కాస్మోటిక్స్ ఎన్ని రోజులు వాడాలో తెలుసుకుందామా..!
ఐ క్రీమ్ – 6 వారాలు, లిప్ లైనర్ – 12 వారాలు, మాయిశ్చరైజర్ – 12 వారాలు, లిక్విడ్ ఐలైనర్ – 6 వారాలు, పౌడర్ ఫౌండేషన్ – 18 వారాలు, లిప్‌స్టిక్ – 24 వారాలు, మస్కారా – 3 వారాలు, ఐబ్రో పెన్సిల్ – 18 వారాలు. సో.. జాగ్రత్తలు తీసుకుంటూ అందంగా కనిపించండి.