పూరీ సినిమాలో హీరోయిన్‌ ఛాన్స్..!

వరుస పరాజయాలతో ఫాంలో కాస్త వెనుకబడ్డ టాలీవుడ్ టాప్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ సారి గట్టి విజయాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు. దీంతో ఇప్పటికే కథను సిద్ధం చేసుకున్న ఈ దర్శకుడు.. దానికి హీరోగా రామ్‌గా ఎంచుకున్నాడు. టాలీవుడ్‌లో క్రేజీ కాంబోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్‌ కోసం వెతుకుతున్న మూవీ యూనిట్ క్యాస్టింగ్ కాల్‌కు పిలుపునిచ్చింది. 18 నుంచి 23 సంవత్సరాలు ఉండి నటనలో గుర్తింపు ఉన్న వారు వారి ఫ్రొఫైల్స్‌ను talenthunt@puriconnects.comకు పంపాలని చిత్ర యూనిట్ పేర్కొంది.

leave a reply