కేసీఆర్‌.. అందగాడు..

ప్రపంచంలోనైనా, దేశంలోనైనా, ఏ టాపిక్‌ అయినా వెంటనే ట్విట్టర్‌లో తనదైన శైలిలో స్పందించే మొదటివ్యక్తి రామ్‌గోపాల్‌ వర్మ. ప్రముఖ డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కూడా తన అభిప్రాయాన్ని వెల్లబుచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కేసీఆర్‌కు అభినందనలు తెలుపుతూ ట్విట్టర్‌లో న్యూస్‌ పోస్ట్‌చేశారు. అంతేకాదు.. ఆయన హీరోల కంటే అందగాడు, ఆకర్షణీయమైన వ్యక్తి, చతురత కలిగినవ్యక్తి అంటూ ట్వీట్‌లో తెగ పొగిడేశాడు వర్మ.

అలాగే.. కేసీఆర్‌ గొప్పతనాన్ని చెబుతూ.. మోడీ గుజరాత్‌లో పటేల్‌ విగ్రహం పెడితే.. తెలంగాణలో అంతకు ఎత్తైన కేసీఆర్‌ విగ్రహాన్ని పెట్టాలి అని వర్మ పోస్ట్ చేశారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ 88స్థానాల్లో గెలుపొందింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ గురువారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

leave a reply