సోనాలీ.. సో హ్యాపీ

బాలీవుడ్‌లోనూ, టాలీవుడ్‌లోనూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి సోనాలీ బింద్రే. తన అందంతో, అభినయంతో కుర్రకారు మదిని ఊర్రూతలూగించింది. కాగా.. గత కొంతకాలంగా ఆమె.. క్యాన్సర్‌ కారణంగా చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఇటీవలె ఆ చికిత్స పూర్తికావడంతో సోనాలీ ముంబై చేరుకుంది.

కాగా.. ‘చాలా రోజుల తర్వాత నేను మళ్లీ తిరిగి సెట్స్‌లో అడుగుపెట్టడం ఓ కలలా ఉంది’ అని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి తన ఆనందాన్ని షేర్‌ చేసింది. మళ్లీ కెమెరా ముందుకొచ్చినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. తిరిగి కెమెరా ముందు నిలబడ్డప్పుడు కలిగిన ఆ ఫీలింగ్‌ మాటల్లో చెప్పలేను’’ అని పేర్కొంది. అయితే.. ప్రస్తుతం ఆమె ఏ సినిమాలో నటిస్తుందనే విషయం మాత్రం తెలుపలేదు.

leave a reply