చంద్రబాబు పాత్ర లేదట..!

దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి రాజకీయ నేపథ్యంలో తెరెకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. కాగా.. రాజకీయాల్లో రాజశేఖర్‌ రెడ్డి ప్రత్యర్థి అయిన సీఎం చంద్రబాబు పాత్రను ఎవరు పోషిస్తున్నారని డైరెక్టర్‌ని మీడియా ప్రశ్నించగా.. ఆయన ఆశ్చర్యపోయే సమాధానమిచ్చారు. ఈ సినిమాలో సీఎం చంద్రబాబు పాత్ర లేదు. మా సినిమా కోసం ఒకరిని తక్కువ చేసి చూపడం మాకు ఇష్టం లేదని సమాధానమిచ్చారు. అంతేకాదు.. వైఎస్‌ జగన్‌ పాత్ర కూడా ఈ సినిమాలో లేదు. కేవలం రాజశేఖర్‌ రెడ్డి పాత్రనే ఈ సినిమా కనిపిస్తుంది. కానీ.. ఈ సినిమాలో కొన్ని కల్పిత పాత్రలు మాత్రం ఉన్నాయని తెలిపారు.

ఈ సినిమాలో మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి రాజశేఖర్‌ రెడ్డి పాత్రలో నటిస్తున్నారు. డైరెక్టర్‌ వీ రాఘవ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. 70 ఎంఎం బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా.. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ చూసిన ప్రేక్షకులు మమ్ముట్టి పోషించిన ఈ పాత్రను ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానున్నది.

leave a reply