చిన్న అమ్మాయి అనుకున్నా..!

తెలుగు వారందరికీ సుపరిచితమైన పేరు అలనాటి నటి భానుప్రియ. అమాయకురాలిగా అప్పటి సినిమాల్లో నటించి, తన చిలిపి చేష్టలతో అందరి మనసుల్లోనూ స్థానం సంపాదించుకుంది. అయితే ఇటీవలె భానుప్రియ ఇంట్లో ఓ సంఘటన చేసుకుంది. ఆమె ఇంట్లో పనిచేస్తున్న సంధ్య(14) అనే బాలికను నటి భానుప్రియ చిత్రహింసలు పెడుతుందని  బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కాగా.. ఈ విషయంపై సినీనటి భానుప్రియ స్పందించారు. ఈ వార్త నన్ను చాలా ఆశ్చర్యానికి గురించేసిందని అన్నారు. ఈ ఆరోపణలు అన్నీ కొట్టిపడేశారు. చిన్న అమ్మాయే కదా అని ప్రేమగా చూశాను.. కానీ ఇలా దొంగతనం చేస్తుందని అనుకోలేదు. మా ఇంట్లో దాదాపు రూ.లక్షా 50వేల విలువైన డబ్బు, బంగారం, కొన్ని వస్తులను ఆ అమ్మాయి దొంగిలించిందని తెలిపారు. వెంటనే ఆమె తల్లికి ఫోన్ చేసి అమ్మాయిని తీసుకెళ్లమని చెప్పినట్టు భానుప్రియ తెలియజేశారు. అయితే.. దొంగిలించిన వాటిలో కొన్నింటిని తెచ్చారని.. మరికొన్నింటిని తీసుకొస్తానని వెళ్లి తనపైనే ఇలా కేసు పెట్టడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.

leave a reply