కుట్ర బగ్నం.. 8 మంది తెలుగువారు అరెస్ట్‌..!

అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ ఏజంట్లు ముల్లును ముల్లు తోనే తీసేశారు. కొంతమంది యువకులు సాగిస్తున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాల కుట్రను తెలివిగా భగ్నం చేసి ఎనిమిది తెలుగు యువకులను అరెస్టు చేశారు. అమెరికా వెళ్లాలని కలగంటున్న తెలుగుయువకులకు వీళ్లు ఫేక్ యూనివర్శిటీల్లో అడ్మిషన్లు ఇప్పించి, స్టుడెంట్ వీసా వచ్చేలా చేసి, విద్యార్థులనే నేపం మీద అమెరికాలో ఉండి ఉద్యోగం చేసేందుకు వీలు కల్పించే వ్యాపారం చేస్తున్నారు. ఈ సేవలందించినందుకు వీరంతా తెలుగు విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు కూడా వసూలు చేస్తున్నారు.

వీళ్లలో కొందరు అమెరికన్ ఇండియన్స్ అయితే, మరికొందరు భారతీయులే. వందలాది విద్యార్థులు చట్టవ్యతిరేకంగా అమెరికాలో నివసించేందుకు వీరు తోడ్పడ్డారనే నేరం మీద యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ (ICE)విభాగం వీరిని అదుపులోకి తీసుకుంది.

అరెస్టయిన వారి పేర్లు: కాకిరెడ్డి భరత్ (29), సురేష్ కందల(31), కర్నాటి ఫణిదీప్ (35), ప్రేం రాంపీస (26), సంతోష్ సామా (28), అవినాశ్ తక్కళ్ల పల్లి (28), అశ్వంత్ నూనె(26),నవీన్ ప్రతిపాటి (29).

ఇందులో ఆరుగురిని డెట్రాయిట్ ఏరియాలో అరెస్టు చేస్తే ఇద్దరని వర్జీనియా, ఫ్లారిడాలో అరెస్టు చేసినట్లు ఐసిఇ ఒక ప్రకటనలో పేర్కొంది. విద్యార్థులని అమెరికాకు రప్పించి అధికారులను బోల్తాకొట్టించి అక్కడ అక్రమంగా నివసించేందుకు కుట్రపన్నారనేది వారి మీద వచ్చిన ఆరోపణ. హోమ్ లాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ ఏజంట్లు దేశవ్యాపితంగా గాలించి ఈ కుంభకోణాన్ని వెలికి తీశారు. ఈ తెలుగు యువకుల గ్యాంగ్ ఏ విధంగా బోగస్ విశ్వవిద్యాలయాలను ఉపయోగించి విద్యార్థులను అమెరికాకు అక్రమ రవాణచేస్తున్నారో, అదే విధంగా ఒక బోగస్ విద్యాలయాన్నే వలగా వేసి అమెరికా అధికారులు ఈ కుంభకోణాన్ని అడ్డుకున్నారు. కుట్రదారులను అరెస్టు చేశారు. 

అంతర్జాతీయ విద్యార్థులను అమెరికా రప్పించేందుకు తెలుగు గ్యాంగ్ వంటి గ్యాంగులు బోగస్ విశ్వవిద్యాలాయలను వాడుకుంటున్నాయి. అందువల్ల పోలీసులు కూడా బోగస్ విశ్వవిద్యాలయాలనే ప్రయోగించి ఈ ఇమిగ్రేషన్  స్కాంను బయటపెడుతున్నారు. తెలుగు గ్యాంగ్ మీద వచ్చిన అరోపణల ప్రకారం వందలాది మంది విదేశీయులను డెట్రాయిల్ లోని ఫార్మింగ్టన్ విశ్వ విద్యాలయం అనే ప్రయివేటు సంస్థ తరఫున 2017 ఫిబ్రవరి, 2019 జనవరి మధ్య రిక్రూట్ చేసుకుని అమెరికాలో ఉద్యోగాలు చేసేందుకు వీలుకల్పించే కుట్ర చేశారు.

అయితే, కుట్రను అదే బోగస్ విశ్వవిద్యాలయం ఉపయోగించి కుట్రతోనే ఛేదించారు. ఫార్మింగ్టన్ విశ్వవిద్యాలయం అనేది హోం ల్యాండ్ సెక్యూరిటీ వాళ్లు వాడుకుంటున్న సంస్థయే. ఈ విషయం తెలియక అరెస్టయిన వారంతా ఈ సంస్థతో ఒప్పందం చేసుకుని వారు వేసిన వలలో ఇరుక్కుపోయారు. ఈ యూనివర్శటీ ఎంత దరిద్రపు గొట్టు సంస్థ అంటే, దీనికి పట్టమని మంచి ఆఫీసు కూడా లేదు. ఒక ఆఫీస్ కాంప్లెక్స్ సెల్లార్ లో నుంచి పనిచేస్తుంది. తమ కాంప్లెక్స్ ఏకంగా ఒక యూనివర్శిటీ ఉందన్న విషయం అక్కడ పనిచేస్తున్న ఇతర కార్యాలయాల వారికి కూడా తెలయదని డెట్రాయిట్ న్యూస్ రాసింది. ఈ బోగస్ విశ్వ విద్యాలయాలకు క్లాసు రూమ్స్ ఉండవు, స్టాఫ్ ఉండరు,  విద్యార్థులు తరగతులకు రారు. ఇండియానుంచి యువకులను రవాణా చేసుకునేందుకు అడ్మిషన్ ఇవ్వడంతో ఈ సంస్థ పని పూర్తవుతుంది. దీనికి భారీగా వస్తూలు చేస్తారు. బ్రోకర్లకు కూడా బాగా ముట్ట చెబుతారు. ఈ ఫీజంతా విద్యార్థి వీసా వచ్చేందుకు సహాయ పడటమే. అందుకే ఈ యూనివర్శిటీకి ఉన్న ఫేస్ బుక్ పేజీలో ఉన్న ఫోటో కూడా బోగసే. ఎవరో తీసింది వాడుకున్నారు. అందుకే అధికారులు కూడా ఇదే అడ్రసులోబోగస్ పేజీ సృష్టించి తెలుగు గ్యాంగ్ ను పట్టుకున్నారు.

Starting in 2015, the university was part of an undercover operation dubbed “Paper Chase” and designed to identify recruiters and entities engaged in immigration fraud, according to the indictment. Homeland Security agents started posing as university officials in February 2017 అని డెట్రాయిట్ న్యూస్ రాసింది.

విద్యార్థులను ఆమెరికా తీసుకువచ్చేందుకు వారికి ఇక్కడ ఆశ్రయం ఇచ్చేందుకు, ఇలా రిక్రూట్ చేసుకునేందుకు వీరంతా భారీగా డబ్బులు వసూలు చేసేవారు. ఈ యూనివర్శిటీ విద్యార్థులను దేశమంతా గాలించి పట్టుకున్నారని అమెరికాలోని ఇమిగ్రేషన్ న్యాయవాది రాహుల్ రెడ్డి అంటున్నారు.

ఇలా రిక్రూట్ చేసున్నవారిని విద్యార్థులని చూపించేందుకు ఈ ముద్దాయిలు విశ్వవిద్యాలయాలనుంచి దొంగ సర్టిఫికేట్లు పుట్టించేవారు. ఇలా తప్పుడు సర్టిఫికేట్లతో ఇమిగ్రేషన్ అధికారులను బోల్తా కొట్టించేవారు. ఈ కుట్రని చేధించేందుకు అమెరికా అధికారులు ఫార్మింగ్టన్ విశ్వవిద్యాలయాన్ని ఒక చక్కటి మార్గమని కనుగొన్నారు. అంతే, రంగంలోకి దుమికారు.

మొదట సామ, కందల ఈ వలలో పడ్డారు. రిక్రూట్ మెంట్ ఏజంట్లనుకుని  మారువేషంలో ఉన్న అధికారులకు దొరికి పోయారు. వీరు ఒక్కొక్క విద్యార్థినుంచి  20 వేల అమెరికన్ డాలర్లు వసూలు చేస్తూ వస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ ఫేక్ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ సంపాదించేది చదివి డిగ్రీలు సంపాదించేందుకు కాదు, అక్కడ స్టూడెంట్ వీసా పొంది ఆ తర్వాత వర్క్ ఆధరైజేషన్ సంపాదించి మెల్లిగా అమెరికాలో తిష్ట వేశేవారు.

అయితే, హోం ల్యాండ్ సెక్యూరిటీ వాళ్లు ఇప్పుడు ఇలాంటి ఫేక్ యూనివర్శిటీనే వాడుకునే కుట్రను భగ్నం చేశారు. అందువల్ల ఫేక్ యూనివర్శిటీలను అమెరికా దూరేందుకు వాడుకోవడం చాలా ప్రమాదకుమని మన తెలుగు వాళ్లే నిరూపించారు.

leave a reply