`జీరో’కి జీరో అయితే రాదు..

షారుక్ ఖాన్‌, కత్రినా కైఫ్‌, అనుష్క శర్మ, జీషన్‌ ఆయుబ్‌, అభయ్‌ డియోల్‌, మాధవన్‌ తదితరులు నటించిన సినిమా `జీరో’.

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుక్‌ ఖాన్ నటించిన చివరి రెండు చిత్రాలు నిరాశకలిగించాయి. ‘రయీస్‌’,  ‘జబ్ హ్యరీ మెట్‌సెజల్‌’ చిత్రంబాక్సాఫీస్‌ వద్ద డీలాపడిపోయాయి. దాంతో తన తర్వాతి కథను చాలా జాగ్రత్తగాఎంచుకోవాలని అనుకున్నారు. అలా ‘జీరో’ చిత్రం పట్టాలెక్కింది. ఇందులో షారుక్‌ ఖాన్‌మరుగుజ్జు పాత్రలో నటించడం విశేషం. కత్రినా కైఫ్‌ తాగుడుకు బానిసైన సూపర్‌స్టార్‌గా,అనుష్క శర్మ సెరీబ్రల్‌పాల్సీతో బాధపడుతున్న నాసా శాస్త్రవేత్తగా నటించడంతో సినిమాపై అంచనాలుపెరిగిపోయాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. మరి ఈరోజుప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జీరో’ చిత్రం షారుక్‌ను మళ్లీ ట్రాక్‌లోకి తెస్తుందా..? లేదా.. చూద్దాం.

స్టోరీ ఏంటంటే..: బౌవ్వా సింగ్‌(షారుఖ్‌)కు ఎత్తు తక్కువే కానీ చమత్కారం, అహంకారం మాత్రం ఎక్కువ. అందమైన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. మ్యారేజ్‌ బ్యూరోలో ఆఫియా(అనుష్క శర్మ) అనే అమ్మాయి ఫొటో చూసి ఆమెను పెళ్లిచేసుకోవాలనుకుంటాడు. తీరా వెళ్లి చూస్తే ఆమె నడవలేదని, జబ్బుతో చక్రాల కుర్చీకే పరిమితమైందని తెలుస్తుంది. దీంతో నిరాశపడతాడు బౌవ్వా. అయినప్పటికీ ఏదో వంకతో ఆఫియాను కలుస్తుంటాడు. మూడడుగులుండే తనను పెళ్లి చేసుకోవడానికి సినిమా హీరోయిన్లు దొరకరన్న నిజం ఒకానొక రాత్రి బౌవ్వాకు బోధపడుతుంది. దీంతో ఆఫియాకు ప్రపోజ్‌ చేస్తాడు. ఈ నేపథ్యంలో ఒకరోజు బౌవ్వాకు బబితా కుమారి (కత్రినా కైఫ్‌) అనే ఓ సినిమా హీరోయిన్‌తో అనుకోకుండా పరిచయమేర్పడుతుంది. ఆ పరిచయం అతన్ని బబితా ఇంటికి ఆహ్వానించేవరకూ వెళ్తుంది. అలా బౌవ్వా మనసు బబితా మీదకు మళ్లుతుంది. కానీ బబితా అతన్ని ఇంటి నుంచి గెంటేసే పరిస్థితి వస్తుంది. అందుకు కారణమేంటి? ఆ తర్వాత బౌవ్వా సింగ్‌ ఏం చేశాడు? తదితర విషయాలు తెరపై చూడాలి.

ఎలా ఉందంటే: ఇలాంటి మరుగుజ్జు పాత్రలో గతంలో విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ నటించారు. ఆ తర్వాతఇలాంటి తరహా పాత్రను ఎంచుకున్న ఏకైక నటుడు షారుకే. సినిమాలో షారుక్‌నుచూస్తున్నంతసేపు కామెడీగానే ఉంటుంది. ప్రధమార్ధం మొత్తం షారుక్‌ పాత్ర, తన కుటుంబం గురించే ఉంటుంది. అసలు కథద్వితీయార్ధం నుంచి మొదలవుతుంది. అనుష్కను పెళ్లి చేసుకోవాలని షారుక్‌ ఆమెనుకలవడానికి వెళ్లినప్పుడు వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. అర్థంకానిఆంగ్లంలో షారుక్‌ చెప్పే డైలాగులు ఫన్నీగా ఉంటాయి. ఆ తర్వాత కత్రినా కైఫ్‌ పాత్రతోవచ్చే సన్నివేశాలు అక్కడక్కడా బాధ కలిగిస్తాయి. ద్వితీయార్ధంలో కొన్ని చోట్లసన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. సల్మాన్‌ ఖాన్‌, శ్రీదేవి, కాజోల్‌, కరిష్మా కపూర్‌, ఆలియా భట్, అభయ్‌ డియోల్‌, మాధవన్‌‌ అతిథుల్లా కనిపించి కాసేపుఅలరిస్తారు. నిర్మాణ విలువలు రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు తగ్గట్టుగారిచ్‌గా ఉన్నాయి. అజయ్‌, అతుల్‌ అందించినసంగీతం బాగుంది.

నటీనటులు: ఇందులో షారుక్‌, అనుష్క శర్మ పాత్రలే ప్రధానం. మరుగుజ్జు పాత్రలో షారుక్‌ నటన ఆకట్టుకుంటుంది. అతను మాట్లాడుతున్నంత సేపు ఏదో చిన్నపిల్లాడు మారాం చేస్తున్నట్లు ఉంటుంది. సెరీబ్రల్‌ పాల్సీతో బాధపడుతున్న నాసా శాస్త్రవేత్త ఆఫియాగా అనుష్క చాలా బాగా నటించారు. ఈ జబ్బుతో బాధపడుతున్నప్పటికీ ఆమె శాస్త్రవేత్తగా మంచి పేరు తెచ్చుకోగలిగిందే కానీ జీవితంలో చిన్న చిన్న విషయాలను కూడా సరిగ్గా ఎంజాయ్‌ చేయలేక ఆమె పడే బాధ కన్నీరుపెట్టిస్తుంది. సూపర్‌స్టార్‌గా కత్రినా కైఫ్‌ బబితా కుమారి పాత్రలో అదరగొట్టేశారనే చెప్పాలి. గత సినిమాలతో పోలిస్తే కత్రినా ఈ చిత్రంలోనే బాగా నటించారనిపిస్తుంది. తన అందం, డ్యాన్సులతో ప్రేక్షకుడిని కట్టిపడేశారు. మిగిలిన పాత్రలు తమ పరిధి మేర చక్కగానే నటించారు.

మొత్తానికి కామెడీ సినిమా చూడాలనుకునే వారికి ఈ సినిమా బెస్ట్‌ ఛాయిస్‌ అని చెప్పవచ్చు.

leave a reply