అదే రోజున ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ థియేట్రికల్‌ ట్రైలర్‌ రిలీజ్‌

వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ నిలుస్తారు. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’తో ఆయన వివాదాలు మరింత ముదిరాయి. కాగా.. రాంగోపాల్‌ వర్మ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా ట్రైలర్‌ను 14వ తేదీన విడుదల చేస్తున్నట్లుగా తెలిపారు. అయితే.. ఈ నెల 22వ తేదీన థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. ఈ నెల 22న ఎన్టీఆర్ ‘మహానాయకుడు’ సినిమా విడుదల అవుతుండగా.. అదే తేదీన అన్ని థియేటర్స్‌లో  ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘మహానాయకుడు’ సినిమా చూసేందుకు ఎవరైతే థియేటర్స్‌కు వెళ్తారో వాళ్లందరూ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ థియేట్రికల్‌ ట్రైలర్‌ని చూడొచ్చని వర్మ అన్నారు.

leave a reply