పెళ్లిపై నగ్మా స్పందన

ఒకప్పుడు టాలీవుడ్ తో పాటు దక్షిణాది చిత్రసీమకు నగ్మా తెలియని వారంటే నమ్మలేరు. చిత్ర సీమలో ఒక వెలుగు వెలిగారు. ఆమె ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. కొందరు నటులతో ఆమె డేటింగ్‌ చేసినట్లు గతంలో వార్తలు కూడా వచ్చాయి. కానీ వాటిపై నగ్మా ఎప్పుడూ స్పందించ లేదు. తదనంతర పరిణామాలలో ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కీలకపాత్రను పోషిస్తున్నారు.
ఓ కార్యక్రమంలో మీరు పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు? అనే ప్రశ్న నగ్మాకు మీడియా నుంచి ఎదురైంది.’పెళ్లి ఎప్పుడు జరగాలని రాసిపెట్టి ఉంటే అప్పుడే జరుగుతుంది అని ఆమె తెలిపారు. తనకు దాంపత్య జీవితంపై నమ్మకం ఉందని,పెళ్లి అనే విషయాన్ని దేవుడు ముందే రాసి పెడతాడు. దాన్ని నేను డిసైడ్ చేయలేను’ అని చెప్పింది.సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని అన్నారు.ప్రస్తుతం తన జీవితంలో ఎవరు లేరని చెప్పారు

leave a reply