పీవీపీ జగన్ లని దులిపేసిన బాబు..!

నిన్న సాయంత్రం వైసీపీ నేత లోక్‌సభ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన ప్రెస్ మీట్ లో పలు విషయాలపై స్పందించారు.. ఆయన ప్రత్యేక హోదా గురించి చేసిన కామెంట్స్ రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ప్రత్యేక హోదా గురించి మాట్లాడినా ఆయన ప్రత్యేక హోదా అన్నది బోరింగ్ సబ్జెక్ట్ అన్నారు ఇక అప్పుడు మొదలయ్యింది ఈ వ్యాఖ్యల పై చర్చ.. అప్పటినుండి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసిన ఇదే టాపిక్.. దీని పై టీవీ ఛానళ్ళు ప్రత్యేక డిబేట్ లు కూడా నిర్వహిస్తున్నారు. ఈ విషయం ఇలా ఉండగా పీవీపీ వ్యాఖ్యలకి చంద్రబాబు స్పందిస్తూ పీవీపీ పై ఆయన పార్టీ పై ఆ పార్టీ అధినేత జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు.

జగన్ నిర్వాకం వల్లే ఏపీలో లక్ష ఎకరాలు నిరుపయోగంగా మారాయని వ్యాఖ్యానించారు. ప్రత్యేకహోదా అన్నది వైసీపీ నేతలకు బోరింగ్ సబ్జెక్టుగా కనిపిస్తోందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తులను లోక్ సభ సభ్యులుగా గెలిపిస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. జగన్ వల్ల కొన్ని వేల ఎకరాలు వృదా అవుతున్నాయని వాటిని కనీసం పండించకుండా వివాదాలనుండి దూరం చేయలేకుండా చిక్కుల్లోకి నెట్టేశారని లెక్కలు చెప్పాడు. వాన్ పిక్ ప్రాజెక్టుకు సంబంధించి 28,000 ఎకరాలు, లేపాక్షిలో మరో 8,808 ఎకరాలు, బ్రాహ్మణీ స్టీల్స్ కేసులో మరో 10,000 ఎకరాలు జగన్ వల్ల కేసుల్లో చిక్కుకుని నిరుపయోగంగా ఉండిపోయాయని చంద్రబాబు తెలిపారు.

ప్రజలని మోసం చేయడం వైసీపీ కి అలవాటన్నారు.. ఎప్పుడూ ఏదో ఒక డ్రామా చేసి దాన్ని రాజకీయం గా వాడుకోవడం వైసీపీకి అలవాటయ్యిందని ఆయన అన్నారు. మొన్నటివరకు టీడీపీ డేటా దొంగలించారని ఆపై ఫారం 7 తో వోట్లు తొలగించారని మరి ఇప్పుడు వివేకా మృతిని రాజకీయం చేస్తున్నారని ఆయన ద్వజమెత్తారు. మోదీ తో కలసి అనైతిక రాజకీయాలకి పాల్బడుతున్నారని ఎవరెన్ని డ్రామాలు చేసిన,కుట్రలు చేసినా ఈసారి కూడా టీడీపీ దే గెలుపని మళ్ళీ నేనే సీఎం అవుతానని ఆయన స్పష్టం చేశారు.

 

leave a reply