ఆ మంత్రి ఇక…జైలుకే?

తమిళనాడు రాష్ట్ర యువజన, క్రీడాశాఖ మంత్రి బాలకృష్ణారెడ్డికి మూడేళ్ళ జైలు శిక్ష పడింది. 1998లో వినాయకుడి ఊరేగింపు సందర్భంగా హోసూర్‌లో బస్సుపై రాళ్లదాడికి పాల్పడిన కేసులో ఆయనకు శిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది. దీనికి గురించి అయన వివరణ  ఇస్తూ తనకు జైలు శిక్ష పడటంపై బాలకృష్ణారెడ్డి హైకోర్టులో అప్పీలు చేస్తానని చెప్పారు. ఇది ఇలా ఉండగా  సీఎం పళనిస్వామి మంత్రికి జైలు శిక్ష పడటంతో సీనియర్ మంత్రులు, ముఖ్య అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.

అయితే కోర్టు ఇచ్చిన తీర్పుపై బాలకృష్ణారెడ్డి మంగళవారం మద్రాసు హైకోర్టులో తన పిటీషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లేలా వ్యవహరించినందుకు గాను మంత్రికి శిక్ష విధిస్తూ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో 108 మంది నిందితులు ఉండగా, వారిలో 16 మందిని కోర్టు దోషులుగా తెల్చింది. ఈ తీర్పుతో బాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యే మంత్రి పదవిని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. తమిళనాడు క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న బాలకృష్ణారెడ్డి హోసూర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

leave a reply