ముక్కెరతో…ప్రత్యేక ఆకర్షణ!

మగువలకు మిక్కిలి సౌందర్యంగా కనిపించేది ముక్కెర. ఈ తరం పెళ్లి వేడుకల్లో ముక్కెరలు మెరిసిపోతున్నాయి. దీంతో ముక్కెరకు పూర్వ వైభవం చేకూరింది. ముఖ్యంగా పెళ్లికూతురు మొదలు, వేడుకకు హాజరయ్యే మగువలందరు ముచ్చటపడి మరి ముక్కెరలు ధరించడంలో ముందుంటున్నారు. అయితే ఈ ముక్కుపుడకలు సందర్భాన్ని పట్టి ధరిస్తే చక్కగా కనిపిస్తారు.

ఈ ముక్కు పుడకలలో ముఖ్యంగా చక్కగా కనిపించే వాటిలో ‘నథ్‌’ అని పిలిచే ముక్కెరల్లో చాలా రకాలున్నాయి. వీటిలో మరాఠీ నథ్‌, హూప్‌ నథ్‌, స్టోన్‌ స్టడెడ్‌ నథ్‌, కుందన్‌ నథ్‌ చెప్పుకోదగినవి. వీటిని సందర్భాన్ని బట్టి అనుసరిస్తే సరి. అలాగే నథ్‌ ఎంపిక కూడా వేసుకొనే బట్టలను బట్టి ఉండాలి . పెళ్లి వేడుకల్లో వీటిని ధరించాలనుకుంటే ముక్కుకు అతుక్కునేలా ఉండాలి, పెళ్లికూతురికి హూప్‌ నథ్‌తోపాటు, చెంపసరాలు కూడా ఉండేలా చూసుకుంటే అందంగా కనిపిస్తారు. రిసెప్షన్లకైతే ముత్యాలు వేలాడే కుందన్‌ నథ్‌ అయితే చక్కగా ఇమిడిపోతారని అంటారు.

leave a reply