నెయిల్ పాలిష్‌తో… ఆకర్షణీయంగా!

మనం ఎక్కువగా నెయిల్ పాలిష్‌తో గోళ్లను అందంగా ఉంచడానికి వాడుతుంటాం. కానీ దీనిని ఇంకా అనేక రకాలుగా వాడుకోవచ్చు. వాటిలో పాత వస్తువులను కొత్త వస్తువులుగా మార్చడానికి నెయిల్ పాలిష్ తన వంతు సాయం చేస్తుందట. ఇంట్లో వేసుకొనే తాళం చెవులు ఎక్కువగా ఉండి ఏ తాళం చెవి దేనిదో తెలియక తికమక పడుతుంటే… ఒక్కో తాళం చెవి చివరకు ఒక్కో రంగు నెయిల్ పాలిష్ వేస్తే సరి.

కొన్ని సార్లు కార్ పై గీతలు పడటం జరుగుతుంటది. ఆ గీతల వల్ల కారు అందవికారంగా తయారవుతుంది. అలాంటప్పుడు  మీ కారు కలర్ నెయిల్ పాలిష్ కొని గీతలఫై వేస్తే సరిపోతుంది. దీంతో కారుపై గీతల్ని కనపడకుండా ఉంచవచ్చు. ఎక్కువ కాలం ఉంగరాలు ధరించేవారికి ఒక్కోసారి ఉంగరం కింద చర్మం పచ్చ రంగులోకి మారుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఉంగరం కింద వైపుకు నెయి్ పాలిష్ పూసి ఎండి పోయాక పెట్టుకోవాలి.

గాజు గ్లాసులకు మరింత అందం చేకూర్చాలంటే  దాని అడుగు భాగానికి మీకు నచ్చిన నెయిల్ పాలిష్ వేస్తే సరి! లేదా నెయిల్ పాలిష్ తో డిజైన్లు వేయండి.

leave a reply