మిరియాలతో జలుబుకు చెక్!

Cork, Ireland

చలి కాలంలో తరచుగా జలుబు చేయడం సాధారణం. ఎక్కువగా తీపి పదార్ధాలు తినడం వల్ల కూడా జలుబు చేయడం చూస్తుంటాం. జలుబు చేసినపుడు ముందుగా గొంతులో మంటగా ఉండటం, దగ్గు, తుమ్ములు రావడం జరుగుతుంది. ఒక్కోసారి జలుబుతో జ్వరానికి కూడా గురవుతారు. జలుబును తగ్గించి శరీరాన్ని వేడిగా ఉంచే కొన్ని పదార్ధాలను తెలుసుకుందాం.

మనం ఎక్కువగా వంటలలో ఉపయోగించే దాల్చిన చెక్కను మెత్తగా చేసుకొని ప్రతిరోజు టీ లోగాని లేదా కూరల్లో గాని ఉపయోగించడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాక శరీర ఉష్ణోగ్రతను పెంచడంలో కూడా సహాయపడుతుంది. అల్లం కూడా జలుబుకు చక్కని ఔషధంగా ఉపయోగపడుతూ…వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో దోహాతపడుతుంది. ఇది జలుబు, దగ్గుకి ముఖ్య నివారణగా పనిచేస్తుంది. జలుబుని తగ్గించడంలో మిరియాలు చక్కగా పనిచేస్తాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వేడి పాలలో మిరియాలపొడిని వేసుకొని తీసుకుంటే జలుబు త్వరగా తగ్గిపోతుంది.

leave a reply