రణ్‌వీర్‌ వేషధారణ కొత్తగా!

తెర ముందు ఓక వెలుగు వెలిగి, తెరవెనుక కూడా సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌గా ఎలా నిలవాలో బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌సింగ్‌కు పెద్దగా చెప్పక్కర్లేదు. ఫ్యాషన్‌లో ట్రెండ్‌ సెట్‌ చేయడమే కాకుండా ఫాలో అవడంలో కూడా రణ్‌వీర్‌ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. స్టయిల్‌ ఎలా ఉన్న సరే దాన్ని పర్ఫెక్ట్ గా సరిపోతాడు. అతను నటించిన ‘సింబా’ చిత్రం కూడా బాక్సాఫీస్‌ వద్ద సరైన విజయం సాధించడంతో రణ్‌వీర్‌ ఇప్పుడు ర్యాపర్‌ పాత్రలో ఆయన నటించిన ‘గల్లీ బోయ్‌’ వచ్చే నెల విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. అందులో ఆయన స్ట్రీట్‌ ర్యాపర్‌గా కొత్త వేష ధారణలో కనిపిస్తారు. ఇటీవల ముంబయిలో ‘గల్లీ బోయ్‌’ ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. దీనికి రణ్‌వీర్‌సింగ్‌, అలియాభట్‌లు హాజరై సందడి చేసారు.

 ఈ సందర్భంగా రణ్‌వీర్‌ ధరించిన  క్రోమ్‌ జాకెట్‌, నియోన్‌ గ్రీన్‌ ట్రాక్‌ సూట్‌ ధరించగా నిజంగా రాక్‌స్టార్‌లా వేదికపై తనదిన ముద్ర వేసాడు. తన ఎనర్జీతో అందరి మనసులు గెలుచుకున్నాడు. ఇంతకుముందు కాలంలో నియాన్‌ రంగులు ధరించడం ఓ ఫ్యాషన్‌. ఏ రంగు అయినా బాగా బ్రైట్‌ టోన్‌లో ఉండటం ఈ నియాన్‌ ప్రత్యేకత. అయితే కొన్ని సంవత్సరాల ముందు ఈ  ఫ్యాషన్‌ మరుగునపడిపోయింది. ఈ మధ్యకాలం నుంచే ఈ నియాన్‌ కలర్స్‌ను వాడటం మొదలు పెడుతున్నారు.   ఇప్పుడు రణ్‌వీర్‌ నియాన్‌ లుక్‌ ఇప్పుడు కొత్తగా దర్శనమిస్తుంది.  

leave a reply