గోళ్లకు రంగు మాత్రమే వేస్తున్నారా..?

ఫ్యాషన్‌ ఆడవారి సొంతం. ముఖం మొకటి అందంగా కనిపిస్తే సరా..? చేతులు, చేతివేళ్ల గోళ్లను కూడా అందంగా, ఆరోగ్యంగా చూసుకోవాలి కదా. ఎప్పటికప్పుడు వాటిని కత్తిరిస్తూ గోళ్ల రంగు వేసుకుంటున్నాం కదా అంటే కాదు. చేతులారా.. చేతి గోళ్లను పట్టించుకోకుంటే ఎలా..! అవి ఆరోగ్యంగా ఉండాలంటే.. ఏం చేయాలి? సో.. మన వంతుగా ఈ కింది విధంగా చేయండి.

మన చేతులు ఒక చోట ఉండవు కాదా.. ఎప్పుడూ ఏదో ఒక పనిచేస్తూనే ఉంటాయి. మరి క్రిములు, బ్యాక్టీరియాలు ఊరుకుంటాయా.. అక్కడే సమస్య మొదలవుతుంది. గోళ్లు ఎప్పుడూ తడిగా ఉన్నా అవి పెరిగే అవకాశాలు ఎక్కువ. అందుకే ఇంటిపనులు చేశాక, తడిపోయేలా తుడుచుకోవాలి. మనలో చాలామందికి గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. గోళ్లకు లాలాజలం తగలడం వల్ల బలహీనమై, చిట్లినట్లు అవుతాయి. గోటి చుట్టూ ఉండే చర్మానికి కూడా మంచిది కాదు. అందుకే ఎంత ఒత్తిడిలో ఉన్నా.. గోళ్లు కొరక్కపోవడమే మంచిది.

గోళ్లు పొడిబారినప్పుడు కూడా అవి విరిగిపోతుంటాయి. అందుకే చేతులకే కాదు, గోళ్లకు కూడా నాణ్యమైన మాయిశ్చరైజర్‌ని రాసుకుంటూ ఉండాలి. ఆలివ్‌నూనెతో వాటికి మర్దన చేయడం కూడా అవసరమే. మీరు ఎంచుకునే గోళ్లరంగుల్లో సల్ఫేట్‌ లేకుండా చూసుకోవాలి. అది గోళ్లకే కాదు, వాటి చుట్టూ ఉన్న చర్మానికి కూడా హానిచేస్తుంది. అలాగే నాణ్యమైన రంగుల్ని ఎంచుకోవడమే మంచిది. దాంతో అవి అందంగా తయారయి.. ఆడువారి అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయి.

leave a reply