దేవాలయాలు ఎలా ఉండాలంటే!

మన సంస్కృతికి ఆనవాలుగా ఉండేది ఆలయాలే. వీటిని మన సంస్కృతికి  పట్టుకొమ్మలుగా కూడా అభివరిస్తుంటారు. స్వయం వ్యక్తములు, దివ్యములు, ఆర్షములు, సిద్ధములు, మానుషములు అనే విధముగా రకరకాలుగా విభజించినప్పటికి… ఆలయాలలో ముఖ్యంగా ఉండేది శిల్పం, నిర్మాణం, వాస్తు విజ్ఞానం,  వంటి వాటికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఆలయాలలో ఎక్కువగా అన్నదానాలు, ప్రకృతి విజ్ఞానం, ధర్మ ప్రదేశం వంటివాటికి నిలయాలుగా ఉండేవి. నృత్యం, గానం, శిల్పం, చిత్రలేఖనం, కవిత్వం వంటి వాటికీ కూడా ఆలయాలు ప్రతీకలుగా ఉండేవి. నిత్యం ఆలయానికి వెళ్లడం వల్ల నియమబద్ధమైన జీవనం, క్రమశిక్షణ పెరుగుతాయని ప్రతీతి. ఆత్మపరమాత్మల తాదాత్మ్యం ఆలయంలో కలుగుతుందని అంతేకాకుండా మత సంబంధమైన పరిజ్ఞానం కలిగించి ఆచరణకు అనువుగా మనుషులను తీసుకెళ్లే ప్రదేశాలుగా ఆలయాలు ఉండేవి.

 ఆలయ సందర్శనతో ధార్మిక భావనలు పెరగడమే కాక ఏకత్వ భావన, సామాజికదృష్టి పెరుగుతాయని అంటారు. పరమాత్మ వైపు మళ్లేందుకు ఆలయం దారి చూపించేది. కానీ క్రమేణా  ఆలయాలు కేవలం భక్తిప్రదర్శనకు మాత్రమే దర్శనమిస్తున్నాయి. అలా కాకుండా.. ప్రస్తుత ఆలయాల్లో ధ్యానకేంద్రం, పుస్తకాలయం,  వంటివి ఏర్పాటును చేయడం వలన మల్లి పూర్వ వైభవం తీసుకురావచ్చు. 

ఆలయంలో అన్నదానం చేయడం, అంతేకాకుండా సంగీత, సాహిత్యాల మేళవింపు ఉన్న భక్తిగీతాలు, కీర్తనలు, తత్వాలునిర్ణీత సమయంలో వినిపిస్తే మనస్సు భక్తితో నిండుతుంది. దేవాలయాల్లో   జరిగే ఉత్సవాల్లో హరికథలు, బుర్రకథలు, పురాణాలకు సంబంధించిన విషయాలను చెప్పడం వలన సంస్కృతి అందరికి చెరువవుతుంది. దీని వల్ల మనస్సు స్వచగా ఉంటుందని, ఎక్కడ మనస్సు స్వచ్ఛంగా ఉంటుందో అక్కడ దేవుడు నివాసం ఉంటాడని చెబుతారు.    

leave a reply