కమల్ వల్ల షూటింగ్‌కు బ్రేక్‌

శంకర్‌ దర్శకత్వంలో ‘భారతీయుడు 2’ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సినిమాకు బ్రేక్‌ పడిందని బాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. కమల్‌హాసన్‌ వృద్ధుడి గెటప్‌లో మేకప్‌ సరిగ్గా లేని కారణంగా షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. 22 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన ‘ఇండియన్‌’కు కొనసాగింపుగా గత నెల 18వ తేదీన చెన్నైలో ‘ఇండియన్‌2’ షూటింగ్‌ ప్రారంభించారు.

చెన్నైలో, హైదరాబాద్‌, పొల్లాచ్చిలో చిత్రీకరణకు ప్లాన్‌ చేశారు. కొద్దిరోజుల పాటు చిత్రీకరణ చురుకుగానే సాగింది. తరువాత షెడ్యూల్‌కి సిద్ధమవుతున్న సమయంలో రషెస్‌ చూసిన శంకర్‌కు కమల్‌హాసన్‌ మేకప్‌ నచ్చలేదట. దీంతో షూటింగ్‌ నిలిపివేసి, హాలీవుడ్‌ మేకప్‌ నిపుణులతో సంప్రదించేందుకు అమెరికా వెళ్లాలని శంకర్‌ నిర్ణయించినట్టు కోలీవుడ్‌ టాక్‌. ఈ సినిమాలో కమల్‌హాసన్‌కు జంటగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తుంది. రాజకీయాలకు కాస్త విరామం ఇచ్చిన కమల్‌హాసన్‌ ఈ చిత్రంలో నటిస్తున్నారు.

leave a reply