సోషల్ మీడియాతో అమ్మాయిలకే?

ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు సోషల్‌ మీడియాలో మునిగి తేలుతున్నారు. అయితే ఎక్కువ సేపు సోషల్ మీడియాను ఫాలో కావడం వలన అనేక సమస్యలకు గురవుతారని తెలిసిందే. ఈ సమస్యలు అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఎక్కువగా వస్తున్నాయని అంటున్నారు. స్మార్ట్ ఫోన్ లు ఎక్కువగా వాడడం వలన సోషల్ మీడియాకు బానిసలవుతున్నారు.

అయితే సోషల్‌ మీడియాను ఫాలో అయ్యే మగపిల్లల కంటే ఆడపిల్లలే ఎక్కువ డిప్రెషన్‌కి లోనవుతున్నారని ఇటీవల నిర్వహించిన అధ్యయనాల్లో తేలింది. సోషల్‌ మీడియాకు ఎక్కువ సమయం కేటాయించే అమ్మాయిలలో  40 శాతం మంది డిప్రెషన్‌కి గురికాగా, అదే అబ్బాయిల విషయంలో 28 శాతం మాత్రమే డిప్రెషన్‌కి లోనవుతున్నారని తేలింది. అయితే రోజులో ఐదుగంటల కన్నా ఎక్కువ సమయం సోషల్‌ మీడియాలో గడిపే అమ్మాయిలలో డిప్రెషన్‌ స్థాయి చాలా ఎక్కువగా ఉందని  పేర్కొన్నారు.

leave a reply