లవ్‌ మ్యారెజ్‌ చేసుకోబోతున్న వెంకటేష్‌ కూతురు

ప్రముఖ నటుడు హీరో వెంకటేష్‌ కూతురు ఆశ్రిత త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారు. హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌ ఛైర్మన్‌ సురేందర్‌ రెడ్డి మనవడితో ఆశ్రిత వివాహం జరగబోతోంది. ఆశిత్రది లవ్‌ మ్యారెజ్‌ అని సమాచారం. మార్చి 1న హైదరాబాద్‌లో వివాహం జరగనుంది. పెళ్లి పనులన్నీ వెంకటేశ్‌ దగ్గరుండి చూసుకుంటున్నారు. వివాహ వేడుక అనంతరం రామానాయుడు స్టూడియోస్‌లో గ్రాండ్‌గా రిసప్షన్‌ను ఏర్పాటుచేయనున్నారు. బాలీవుడ్‌కు చెందిన సెలబ్రిటీలు కూడా వేడుకకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

కాగా.. ‘ఎఫ్‌2’ సినిమాతో హీట్‌ కొట్టారు వెంకటేష్‌. పెళ్లి వేడుక పూర్తయ్యాక వెంకటేశ్‌ ‘వెంకీ మామ’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇందులో వెంకటేశ్‌ మేనల్లుడు, సినీ నటుడు నాగచైతన్య కూడా ప్రధాన పాత్రలో నటించనున్నారు.

leave a reply