కొబ్బరి నీళ్లు తాగితే… షుగర్ పెరుగుతుందా?

షుగర్ వ్యాధితో బాధపడేవారు కొబ్బరి నీళ్లును దూరంగా ఉంచుతారు. షుగర్ లెవల్స్ పెరుగుతాయని భయంతో కొబ్బరి నీళ్లు తాగకుండా దూరం పెడతారు. అయితే అలాంటివన్ని కేవలం అపోహలే అని పరిశోధకులు వెల్లడించారు. కొబ్బరి నీళ్లు తాగేవారిలో షుగర్ లెవల్స్ పెరగవని.. తగ్గుతాయని వారు పేర్కొన్నారు. కొబ్బరినీళ్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడమే దీనికి కారణంగా తెలిపారు.

అయితే కొబ్బరి నీళ్లలో కేవలం మూడు గ్రాముల పీచు పదార్థం ఉంటుందని, సులువుగా జీర్ణమయ్యే ఆరు గ్రాముల పిండి పదార్థం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని. మధుమేహంతో బాధపడేవారు నిరభ్యంతరంగా కొబ్బరినీళ్లు తీసుకోవచ్చని పరిశోధకులు తెలియచేసారు.

కొబ్బరి నీళ్లలో ఇన్సులిన్‌కి స్పందించే గుణాన్ని మెరుగుపరచి రక్తంలో చక్కెరను తగ్గించే మెగ్నీషియం విరివిగా ఉన్నందువల్ల టైప్-2 డయాబెటీస్, ప్రీ-డయాబెటిక్స్ ఉన్నవారు కొబ్బరినీళ్లు తీసుకుంటే మేలని తెలిపారు. 

leave a reply