వ్యక్తిగతంగా… విమర్శించాడు!

దక్షిణాఫ్రికా క్రికెటర్‌పై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసి క్షమాపణలు కోరిన సర్ఫరాజ్ ను దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ అతని క్షమాపణలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే నిబంధనల ప్రకారం ఐసీసీ చర్యలు తీసుకుంది. అతనికి నాలుగు వన్డేల నిషేధాన్ని ప్రకటించింది. అయితే దీనిపై అక్తర్ ఘాటుగా స్పందించాడని సర్ఫరాజ్ తెలిపాడు తాను వ్యక్తిగతగా తనని విమర్శించాడు అని తెలిపాడు. తన వ్యాఖ్యల పట్ల సర్ఫరాజ్‌ బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సిందే అని అక్తర్ విమర్శించగా, అవి సాధారణ విమర్శల్లా లేవని వ్యక్తిగతంగా దాడి చేసినట్లు ఉందని సర్ఫరాజ్‌ అభిప్రాయపడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో నాకు అండగా నిలిచిన పాక్‌ క్రికెట్‌ బోర్డ్‌(పీసీబీ)కు కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో వ్యక్తిగతంగా మరింత మెరుగవుతానని తెలిపాడు.

దక్షిణాఫ్రికా ఆటగాడితో అలా ప్రవర్తించినందుకు బాధపడుతున్నానని, ఇలాంటి తప్పు నుంచి గుణపాఠం నేర్చుకున్నానని  వివరిస్తూ క్షమాపణ కూడా చెప్పాడు. ఈ సంఘటనను మరీ పెద్దది కాకుండా చూసిన పీసీబీ కృతజ్ఞతలు తెలిపాడు. నాపై ఐసీసీ విధించిన నలుగు మ్యాచ్‌ల నిషేధాన్ని కూడా అంగీకరిస్తున్నా. ఈ వివాదం ఇంతటితో ముగియడంతో పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో కూడా ఆడతానని సర్ఫరాజ్‌ తెలిపాడు.

leave a reply