టీ తాగితే… సమస్యలా?

టీ తగని వారంటూ ఎవరు ఉండరు కానీ..టీ తాగితే కూడా ప్రమాదమేనంట టీ ప్రియులకు ఇది కొద్దిగా నిరాశ కలిగించిన నిజమేనంటున్నారు. అయితే ఇక్కడ టీ తాగడం వలన సమస్య ఏంటంటే కిడ్నీ సమస్య వస్తుందంట. కేవలం టీ  తాగడం వల్ల మాత్రమే కిడ్నీ సమస్యలు ఉండవుని చక్కెర శాతం ఎక్కువ వేసుకుని తాగేవారికి ఈ సమస్య తలెత్తే అవకాశం ఉందంటున్నారు. టీ అనే కాకుండా చక్కెర ఎక్కువగా ఉపయోగించే వాటిని ఎక్కువగా తీసుకునే వారికి కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

తాజాగా జాన్‌ హోప్‌కిన్స్‌ యూనివర్శిటీ దాదాపుగా మూడు వేల మంది మీద చేసిన అధ్యయనం అనంతరం ఒక స్పష్టత ఇచ్చారు. తీపికీ, కిడ్నీ సమస్యలకు నేరుగా ఎటువంటి సంబంధం లేదనీ, అయితే చక్కర శాతం అధికంగా తీసుకునే వారిలో ఊబకాయం, ఇన్సులిన్‌ తగ్గడం, అధికరక్తపోటు వంటి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, ఇవే కిడ్నీ సమస్యకు ధారి తీస్తుందని వారు అంటున్నారు. అయితే తీపి లేకుండా టీ తాగడం మంచిదో లేదో మాత్రం వివరించలేదు.  

leave a reply